Top
logo

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్‌!

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్‌!
Highlights

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లిగ్) రానే వచ్చేస్తోంది. ఐపీఎల్...

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లిగ్) రానే వచ్చేస్తోంది. ఐపీఎల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. కాగా ఇప్పటికే తమ జట్లు మైదానాల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ టీమ్ కూడా తన జట్టుతో మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం కోహ్లీ తన ట్వీట్టర్ ద్వారా పంచుకున్నాడు. అయితే ఆర్సీబీ జట్టు గత 2008 నుండి ఇప్పటి వరకు ముచ్చటగా మూడు సార్లు ఆడింది. కానీ ముచ్చటగా మూడు సార్లు ఆర్సీబీ జట్టు ఒడిపోయిన విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో రాబోయే వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా మొదటిసారి మెగా ఈవెంట్‌లో పాల్గొననుంది. అయితే టీమిండియా కెప్టెన్ కోహ్లీపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి వన్డే ప్రపంచకప్‌ టీమిండియా జట్టు కెప్టెన్ కోహ్లీ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. అలాగే ఐపీఎల్‌లో ముచ్చటగా మూడు సార్లు ఒడిపోయినా ఆర్సీబీ జట్టుకి అందనిద్రాక్షలా మారిన ఐపీఎల్ టైటిల్ విజేతగా కోహ్లీ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఎంఅవుతుందో. ఈసారైనా కోహ్లీ జట్టు ఆర్సీబీ ఐపీఎల్ విన్నర్ గా నిలుస్తోందో లేక మళ్లీ ఎప్పటి లాగే సీన్ రీపిట్ అవుతుందో చూడాలి.

Next Story

లైవ్ టీవి


Share it