ఒక ఓవర్‌లో 77 పరుగులు చేసిన ఘనడు ఇతడే

ఒక ఓవర్‌లో 77 పరుగులు చేసిన ఘనడు ఇతడే
x
రాబర్ట్‌ వాన్స్‌, జర్మన్
Highlights

స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ వరుస బంతుల్లో ఆరు సిక్సులు కొడితేనే వామ్మో అనుకున్నాం.

స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ వరుస బంతుల్లో ఆరు సిక్సులు కొడితేనే వామ్మో అనుకున్నాం. మరి ఒకే ఒక ఓవర్ లో 77 పరుగులు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజమే. అరే ఆరు బంతుల్లో ఆరు సిక్సులు తలించినా 36 పరుగులు అవుతాయే గానీ, 77 పరుగులు ఏలా వచ్చాయి అనే కదా మీ సందేహం. అయితే ఇప్పుడు పూర్తి వివరాల్లోకి వెళ్దాం... సాధారణంగా ఒక బౌలర్ ఓవర్‌లో 6 నుంచి 10 పరుగులు దారుణంగా బౌలింగ్‌ అంటే 30 పరుగులు ఇస్తుంటాడు. ఈ విచిత్ర ఘటన ఫిబ్రవరి 20, 1990న చోటుచేసుకుంది. అయితే ఈ రికార్డు అంతర్జాతీయ మ్యాచ్‌లో కాకుండా ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో జరిగింది.

ఫిబ్రవరి 20, 1990న ఏళ్ల క్రితం వెల్లింగ్టన్‌, కాంటర్‌బరీ జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో వెల్లింగ్టన్‌ 59 ఓవర్లలో 291 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 291 పరుగుల లక్ష్య ఛేదనలో కాంటర్‌బరీ 108 పరుగులకే ఏనిమిది వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులో ఎల్‌కే జర్మన్‌ (160 నాటౌట్‌), రోజర్‌ ఫోర్డ్‌ (14 నాటౌట్‌) ఉన్నారు. కాంటర్‌బరీ విజయానికి 2 ఓవర్లలో 95 పరుగులు అవసరం ఉంది. దీంతో అసాధ్యం కాబట్టి మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని కాంటర్‌బరీ నిర్ణయించింది. రెండు వికెట్లు తీస్తే గెలవచ్చని వెల్లింగ్టన్‌ భావించింది. దీంతో ఎలాగైనా గెలవాలని వెల్లింగ్టన్‌ కెప్టెన్‌ మెక్‌ స్వీనే బంతిని బ్యాట్స్‌మన్‌ రాబర్ట్‌ వాన్స్‌కు ఇచ్చాడు.

అయితే రాబర్ట్‌ వాన్స్‌ ఏకంగా 22 బంతులు ఆ ఓవర్‌లో వేశాడు. కాగా..17 నోబాల్స్ ఉండడం విశేషం. కాంటర్‌బరీ బ్యాట్స్‌మెన్‌ జర్మన్‌ 8 సిక్సులు, 5 ఫోర్లు బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 77 పరుగులొచ్చాయి. ఈ క్రమంలోనే జర్మన్‌ శతకం కూడా సాధించిడం విశేషం. చివరి ఓవర్‌లో 18 పరుగులు చేస్తే కాంటర్‌బరీ విజయం సాధించవచ్చని భావించింది. సెంచరీతో ఊపుమీదున్న జర్మన్‌ కాంటర్‌బరీ విజయాన్ని ఇచ్చేలా కనిపించాడు. చివరి ఓవర్‌లో ఇవాన్‌ గ్రే వేశాడు. అయితే కాంటర్‌బరీ జట్టు 5 బంతుల్లో 17 పరుగులే చేసింది. ఆఖరి బంతిని ఎదుర్కొన్న రోజర్‌ ఫోర్డ్‌ పరుగు సాధించలేకపోడయాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గెలవాల్సిన మ్యాచ్ డ్రాగా ముగియడంతో వెల్లింగ్టన్ నిరాశపడింది. రాబర్ట్‌ వాన్స్‌ ఓవర్లో 77 పరుగులు ఇచ్చి అత్యంత చెత్త రికార్డు సృష్టించాడు. రాబర్ట్‌ వాన్స్‌ న్యూజిలాండ్‌ తరపున 4 టెస్టులు, 8వన్డేలు మ్యాచ్ లు ఆడాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories