ఇవాళ భారత్, న్యూజిలాండ్ మూడో టీ20

* క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా

R Tripura Malini
Updated on: 22 Nov 2022 12:50 PM IST
today is the third t20 between india and new zealand
X

ఇవాళ భారత్, న్యూజిలాండ్ మూడో టీ20

India Vs New Zealand: న్యూజిలాండ్‌‌తో తొలి మ్యాచ్‌‌ రద్దయినా సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ కురిపించిన పరుగుల వర్షంతో రెండో టీ20లో అద్భుత విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు సిరీస్‌ ‌పై గురి పెట్టింది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో గెలిచి 2–0 తో సిరీస్‌‌ సొంతం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు జట్టులో అవకాశం కోసం యంగ్‌‌స్టర్స్‌‌ సంజు శాంసన్‌‌, ఉమ్రాన్‌‌ మాలిక్‌‌ ఎదురు చూస్తున్నారు.

చివరి పోరులో అయినా టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ వీరికి చాన్స్‌‌ ఇస్తుందా? లేదా గత మ్యాచ్‌‌ విన్నింగ్‌‌ కాంబినేషన్‌‌కు కట్టుబడుతుందా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది. మరోవైపు రెండో మ్యాచ్‌‌లో తేలిపోయిన కివీస్‌‌ ఈ పోరులో గెలిచి సిరీస్‌‌ పంచుకోవాలని చూస్తోంది. కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ ముందుగా షెడ్యూల్‌‌ అయిన మెడికల్‌‌ అపాయింట్‌‌ కారణంగా ఈ మ్యాచ్‌‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో టిమ్‌‌ సౌథీ టీమ్‌‌ను లీడ్‌‌ చేయనున్నాడు.

R Tripura Malini

R Tripura Malini

Next Story