IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ-20 మ్యాచ్

IND vs SA: సిరీస్‌పై కన్నేసిన రోహిత్ సేన.. ఇప్పటికే సిరీస్ 1-0తో ముందంజలో భారత్

Jyothi
Published on: 2 Oct 2022 8:09 AM IST
Today is the Second T20 Match Between India and South Africa
X

IND vs SA: నేడు భారత్, దక్షిణాఫ్రికా రెండో టీ-20 మ్యాచ్

IND vs SA: ఇటీవల ఆస్ట్రేలియాపై సిరీస్‌ చేజిక్కించుకున్న రోహిత్‌ సేన.. మరో కప్పుపై కన్నేసింది. దక్షిణాఫ్రికాతో తొలి పోరులో బౌలర్లు విజృంభించడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచిన టీమ్‌ఇండియా నేడు రెండో టీ20 ఆడనుంది. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరం కాగా.. మరోసారి పేస్‌ బౌలింగ్‌ పరీక్షకు గురికానుంది. మరోవైపు సిరీస్‌ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఈ మ్యాచ్‌కు సౌత్ ఆఫ్రికా సిద్ధమైంది. బౌలింగ్‌పై బెంగ లేకపోయినా... బ్యాటింగ్‌ దళంపై సఫారీ ఆందోళన చెందుతోంది.

సిరీస్‌లో ఘనమైన శుభారంభంతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. స్టార్‌ బ్యాటర్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ వారి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇక గత మ్యాచ్‌ ఫలితం కంటే.. ప్రదర్శనే దక్షిణాఫ్రికాకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు, హిట్టర్లు అందుబాటులో ఉన్న సఫారీ బ్యాటింగ్‌ లైనప్‌ పేకమేడలా కూలిన తీరు ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. ఇక ఇవాళ్టి మ్యాచ్‌కు కూడా వాన గండం పొంచి ఉంది.

Jyothi

Jyothi

Next Story