పోరు మొదలైంది!

పోరు మొదలైంది!
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో భగ్నగా.. ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీ పోరు మొదలైంది. తొలి మ్యాచ్ విజయంతో ఉత్సాహం ఉరకలెత్తుతున్న టీమిండియా...

వరల్డ్ కప్ టోర్నీలో భగ్నగా.. ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య హోరా హోరీ పోరు మొదలైంది. తొలి మ్యాచ్ విజయంతో ఉత్సాహం ఉరకలెత్తుతున్న టీమిండియా మరో విజయం పై కన్నేసింది. ఇక రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న ఆసీస్ ఈ మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. రెండు జట్లూ టైటిల్ పోరుకు హాట్ ఫేవరేట్లు గా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు జరుగుతున్న పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

తొలి ఓవర్‌ ముగిసే సమయానికి టీమిండియా 2 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 2(6), శిఖర్‌ధావన్‌ 0(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇండియా జట్టు: శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, లోకేశ్‌ రాహుల్‌, ఎంఎస్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ర్పీత్‌ బుమ్రా.

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌, ఉస్మాన్‌ ఖవాజా, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టాయినిస్‌, అలెక్స్‌ కేరీ, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, పాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, ఆడమ్‌ జంపా

Show Full Article
Print Article
More On
Next Story
More Stories