ప్రారంభమైన భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే మ్యాచ్‌

ప్రారంభమైన భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే మ్యాచ్‌
x
Highlights

* భారత బౌలర్లు ఆకట్టుకుంటారా లేదా అనే దాని కోసం టీమిండియా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు

India Vs New Zealand: న్యూజిలాండ్‌లో జరుగుతున్న రెండో వన్డేలో గెలిచి తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా చూస్తోంది. కీలకమైన రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో భారత క్రికెటర్లు ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో న్యూజిలాండ్ ఈ సిరీస్‌లో 1-0 తేడాతో ముందు ఉంది. సిరీస్‌లో ఉండాలంటే ఈ రెండో మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాలో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. శార్ధూర్ ఠాకూర్ స్థానంలో దీపక్ చహర్, సంజు శాంసన్ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నారు. టీమిండియా భారీ టార్గెట్‌ను కివీస్ జట్టు ముందు పెట్టాల్సి ఉంది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టీమిండియా నెగ్గుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆక్లాండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలవడంతో కివీస్ 10 తేడాతో ముందంజలో ఉంది. దీంతో ఈ రెండో వన్డే భారత్‌కు కీలకంగా మారింది. తొలి వన్డేలో భారత్‌ను ఓడించిన ఊపులో ఉన్న న్యూజిలాండ్ జట్టు రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు కసరత్తులు చేస్తోంది.

తొలి వన్డే మ్యాచ్‌లో పరాజయం పాలైన టీమిండియా ఈ రెండో వన్డేలో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. తొలి వన్డేలో భారత బౌలర్ల పేలవ ప్రదర్శపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. రెండో వన్డేలో భారత బౌలర్లు ధీటుగా రాణించాల్సిన అవసరముంది. బ్యాటింగ్ లైనప్ బాగా బలంగా కనిపిస్తుండగా బౌలర్ల ప్రదర్శన టీమిండియా ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. తొలి వన్డే ఓటమి నుంచి నేర్చుకుని రెండో వన్డేలో భారత బౌలర్లు ఆకట్టుకుంటారా లేదా అనే దాని కోసం టీమిండియా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories