వెస్టిండీస్ టూర్ కు టీమిండియా సెలక్షన్స్ వాయిదా

వెస్టిండీస్ టూర్ కు టీమిండియా సెలక్షన్స్ వాయిదా
x
Highlights

వచ్చే నెలలో వెస్టిండీస్‌లో పర్యటించే భారత జట్లను ఎంపిక చేసేందుకు ఈరోజు సెలక్షన్ కమిటీ సమావేశం కావలసి ఉంది. అయితే ఈ సమావేశాలను వాయిదా వేశారు. ఆదివారం...

వచ్చే నెలలో వెస్టిండీస్‌లో పర్యటించే భారత జట్లను ఎంపిక చేసేందుకు ఈరోజు సెలక్షన్ కమిటీ సమావేశం కావలసి ఉంది. అయితే ఈ సమావేశాలను వాయిదా వేశారు. ఆదివారం సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఇంతవరకూ బీసీసీఐ సెక్రటరీ సెలక్షన్ కమిటీ సమావేశాలకు కన్వీనర్ గా ఉండే వారు. అయితే, సీవోసీ ఆదేశాల మేరకు ఇక చీఫ్ సెలక్టర్ ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. ''ఈ నేపథ్యంలో కొన్ని న్యాయపరమైన విధానాలను అనురించాల్సివుంది. అంతే కాకుండా.. సమావేశానికి కెప్టెన్‌ అందుబాటులో ఉన్నాడా లేదా అన్న అంశం గురించి క్రికెట్‌ ఆపరేషన్స్‌ బృందం సీఓఏ ఛైర్మన్‌కు వివరించాల్సివుంది. అదీగాక, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ నివేదికలు శనివారం సాయంత్రానికి అందుతాయి'' అని వాయిదాకు గల కారణాలు చెప్పారు ఓ బీసీసీఐ అధికారి.

లండన్ లో ఉన్న కెప్టెన్ కోహ్లీ గురువారమే ముంబాయి చేరుకున్నాడు. ఆదివారం సమావేశంలో కోహ్లీకూడా పాల్గొంటాడు. ఇంతకు ముందు వెస్టిండీస్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్ లకు కోహ్లీ దూరం అవుతాడని అనుకున్నారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో పూర్తి పర్యటనకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఆగస్టు 3న ఆరంభమయ్యే విండీస్‌ పర్యటనలో భారత్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories