టెస్టుల్లో రోహిత్ శర్మ భవితవ్యం అటో ఇటో తేల్చేస్తారా?

టెస్టుల్లో రోహిత్ శర్మ భవితవ్యం అటో ఇటో తేల్చేస్తారా?
x
Highlights

భారత జట్టు ఓపెనర్ గా పొట్టి క్రికెట్ లో గట్టి ఆట చూపించే భారత్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లలో రికార్డ్ అంత బాగోలేదు. ఓపెనర్ గా సత్తా చూపించే ఈ రోహిట్ బ్యాట్స్ మేన్ కు టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో ఆడుతుడడం పెద్దగా కలిసి రాలేదని చెబుతారు.

భారత జట్టు ఓపెనర్ గా పొట్టి క్రికెట్ లో గట్టి ఆట చూపించే భారత్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ లలో రికార్డ్ అంత బాగోలేదు. ఓపెనర్ గా సత్తా చూపించే ఈ రోహిట్ బ్యాట్స్ మేన్ కు టెస్టుల్లో మిడిల్ ఆర్డర్ లో ఆడుతుడడం పెద్దగా కలిసి రాలేదని చెబుతారు. అయితే, ఇటీవల రోహిత్ శర్మ విండీస్ తో సిరీస్ కు తుది జట్టులో స్థానం సాధించలేకపోయాడు. ఇప్పుడు సౌతాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో రోహిత్ శర్మను ఈ సిరీస్ కు ఎంపిక చేయాలని కోచ్ రవిశాస్త్రి నిర్ణయించినట్టు తెలుస్తోంది. వన్డేలు, టీ20 లలో ఓపెనర్ గా చెలరేగిపోయే రోహిత్ టెస్ట్ లలో మిడిల్ ఆర్డర్ లో ఆడటం వల్లే విఫలం అవుతున్నాడని అందరూ భావిస్తున్నారు. అందుకే ఈ సిరీస్ లో ఓపెనర్ గా రోహిత్ ని ఆడించాలనేది రవిశాస్త్రి వ్యూహం గా చెబుతున్నారు. దీని వలన రెండు లెక్కలు తెలిపోతాయని రవిశాస్త్రి భావిస్తున్నారట.

వెస్టిండీస్ తో సిరీస్ లో ఓపెనర్ రాహుల్ విఫలం అయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్ లోనూ ఒక్క దానిలో మాత్రమే 44 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ హనుమ విహారి మాత్రం ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ తో అదరగొట్టాడు. దీంతో రాహుల్ ను ఆపి.. రోహిత్ ని ఆడించాలనుకుంటున్నారు. ఈ వ్యూహం కనుక విజయవంతం అయి రోహిత్ సక్సెస్ అయితే, జాతు ఓపెనింగ్ సమస్య తీరిపోతుంది. ఒకవేళ రోహిత్ విఫలం అయితే ఇక టెస్ట్ లలో ఇదే అతని సిరీస్ గా నిర్ణయించేయవచ్చు. అప్పుడు ఎటువంటి విమర్శలు తలెత్తకుండా సాఫీగా రోహిత్ కు టెస్ట్ ల నుంచి ఉద్వాసన పలికేసే వీలు కుదురుతుంది. ఎలా చూసినా టీం మేనేజిమెంట్ కి ఈ నిర్ణయం చక్కగా ఉపయోగపడే అవకాశం ఉందనీ, అందుకే రోహిత్ ను సౌతాఫ్రికా సిరీస్ లో ఓపెనర్ గా ఆడించాలని భావిస్తున్నారానీ పరిశీలకులు చెబుతున్నారు.

2013లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ.. వరుసగా తొలి రెండు టెస్టుల్లోనూ 177, 111 పరుగులు చేశాడు. కానీ.. ఆ తర్వాత 25 టెస్టులాడిన ఈ విధ్వంసక హిట్టర్ సాధించింది ఒక్క సెంచరీ మాత్రమే. మొత్తంగా.. ఆడిన 27 టెస్టుల్లో మూడు శతకాలు, పది అర్ధశతకాలు బాదిన రోహిత్‌ని ఈసారి మిడిలార్డర్‌లో కాకుండా ఓపెనర్‌గా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీమిండియా మేనేజిమెంట్ భావిస్తోంది. ఒకవేళ దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రోహిత్ విఫలమైతే.. ఈ 32 ఏళ్ల ఓపెనర్ టెస్టు కెరీర్ ప్రశ్నార్థకం వుతున్దనడంలో ఏ మాత్రం సందేహం లేదు. రోహిత్ శర్మ చివరిగా 2018, డిసెంబరులో భారత్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories