IND vs BAN: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం

IND vs BAN: 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్‌ గెలుపు

Jyothi
Updated on: 18 Dec 2022 6:28 PM IST
Team India Won the First Test Against Bangladesh
X

IND vs BAN: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం

IND vs BAN: చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 324 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ నాలుగు, కుల్దీప్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించగా మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌ తలా వికెట్‌ పడగొట్టారు. ఇక బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ జాకీర్‌ హసన్‌ సెంచరీతో మెరవగా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ 84 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది.

Jyothi

Jyothi

Next Story