టీమిండియా చితక్కొట్టుడు..

టీమిండియా చితక్కొట్టుడు..
x
Highlights

వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి ఊపు మీదున్న ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా నుంచి సవాల్ ఎదురింది. టోర్నీలో భాగంగా ఓవల్ మైదానంలో ఈరోజు...

వరల్డ్ కప్ లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి ఊపు మీదున్న ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా నుంచి సవాల్ ఎదురింది. టోర్నీలో భాగంగా ఓవల్ మైదానంలో ఈరోజు జరుగుతున్న టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోయారు. నిదానంగా బ్యాటింగ్ ప్రారంభించి జోరుగా స్కోరు చేశారు. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మొదటి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 52 పరుగులు చేసిన రోహిత్ ఔతయ్యాకా వచ్చిన కోహ్లేతో కలసి ధావన్ స్కోరు బోర్డును ఆగనీయకుండా పరిగెత్తించాడు. ఈ క్రమంలో సెంచరీ చేశిన ధావన్ 109బంతుల్లో 117 పరుగులు చేసి, స్టార్క్‌ బౌలింగ్‌లోబౌండరీలైన్‌ వద్ద లయాన్‌ చేతికి చిక్కాడు. తరువాత స్కోరుబోర్డు పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు వచ్చింది. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ను కాదని అనూహ్యాంగా నాలుగో స్థానంలో హార్ధిక్‌ పాండ్య బరిలోకి దింపారు.

తానేదుర్కున్నమొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న పాండ్య ఆ తరువాత రెచ్చిపోయాడు. కెప్టెన్ కోహ్లీతో కలసి స్కోర్ బోర్డ్ ను పరుగులెత్తించాడు. ఈ క్రమంలో కోహ్లీ తన అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ధాటిగా ఆడిన పాండ్య 7బంతుల్లో 48 పరుగులు చేసి భారీ షాట్ కు ప్రయత్నించి ఫించ్‌ చేతికి చిక్కాడు. పాండ్యా అవుటయిన వెంటనే క్రీజులోకి వచ్చిన ధోనీ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కోహ్లీ తో కలసి కదం తొక్కాడు. కేవలం 14 బంతులు ఎదుర్కొన్న మహీ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌ సహా 27 పరుగులు చేశాడు. మరో భారీ షాట్ కు ప్రయత్నించి స్టోన్స్ కి రిటన్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ధోనీ అవుటైన తరువాత క్రీజులోకి వచ్చిన కెఎల్ రాహుల్ వస్తూనే సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ చివర్లో భారీ షాట్ కు ప్రయత్నించి 82 పరుగులు చేసిన కోహ్లీ, స్టొయినిస్‌ బౌలింగ్లో కమిన్స్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి రాహుల్ బౌండరీ బాదడంతో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది.

టీమిండియా స్కోరు బోర్డు..

















ఇంగ్లాండ్ బౌలింగ్

















Show Full Article
Print Article
More On
Next Story
More Stories