పాపం ఇంగ్లాండ్.. స్మిత్ కు అన్నీ అలా కలిసొచ్చాసాయంతే!

పాపం ఇంగ్లాండ్.. స్మిత్ కు అన్నీ అలా కలిసొచ్చాసాయంతే!
x
Highlights

ఒక్కోసారి అలా జరిగుంటే ఎంత బావుణ్ణు అనిపిస్తుంది. ముఖ్యంగా క్రికెట్ లో ఇలా చాలాసార్లు అనిపిస్తుంది. అనుకోకుండా మిస్ అయిన క్యాచ్ మ్యాచ్ ని మార్చేస్తుంది. ఇప్పుడు యాషెస్ లో భాగంగా స్మిత్ డబుల్ సెంచరీ కూడా అలానే అనిపిస్తోంది ఇంగ్లాండ్ క్రికెటర్లకి. స్మిత్ ఇచ్చిన రెండు క్యాచ్ లను వదిలి పెట్టి ఉసూరు మన్న వారికి చుక్కలు కనిపించాయి. ఇంకోసారి క్యాచ్ పట్టుకున్న తరువాత అది నోబాల్ అవడంతో అదృష్టాన్ని తిట్టుకోక తప్పలేదు ఇంగ్లాండ్ టీం కి

ఇంగ్లాండ్ ఆసీస్ మధ్య జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ స్మిత్ ద్విశతకంతో మెరిశాడు. క్రీజులోకి దిగిన దగ్గరనుండీ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన స్మిత్ సిరీస్ లో వరుసగా మూడో సెంచరీ బాదేశాడు. అయితే, ఈ డబుల్ సెంచరీ సాధించే క్రమంలో మూడు సార్లు స్మిత్ జీవనదానం పొందాడు. కచ్చితంగా స్మిత్ ను పెవిలియన్ చేరిస్తేనే ఆసీస్ కు అడ్డుకట్ట వేయగాలమనే విషయం ఇంగ్లాండ్ బౌలర్లకు తెలిసిందే. అయినా.. అదృష్టం కూడా కల్సి రావాలి కదా. స్మిత్ ప్రతిభను తక్కువ చేయడం కాదు కానీ.. ఇంగ్లాండ్ బౌలర్ల వైపు అదృష్టం లేదని మాత్రం చెప్పొచ్చు.

- స్మిత్ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను జోఫ్రా ఆర్చర్ వదిలేశాడు.

- మరోసారి 82 పరుగులు చేసిన తరువాత రనౌట్ ప్రమాదం నుంచి త్రుటిలో బయట పడ్డాడు.

- ఇక ముచ్చటగా మూడోసారి.. సెంచరీ పూర్తయిన వెంటనే లీచ్ బౌలింగ్ లో స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్తోక్స్ కి దొరికిపోయాడు. అయితే, అది నోబాల్ అయ్యింది.

ఇలా మూడు సార్లు బతికిపోయిన స్మిత్ ద్విశతకం సాధించి హీరో అయిపోయాడు. పాపం ఇంగ్లాండ్ అనిపిస్తోంది కదూ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories