వేగం లేని బ్యాటింగ్..

వేగం లేని బ్యాటింగ్..
x
Highlights

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌బ్యాటింగ్ లో నెమ్మదించింది. వరుసగా ఓపెనర్లు అవుట్ కావడంతో ఆచి తూచి ఆడుతోంది. తొలుత భారీ...

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ముంబయి ఇండియన్స్‌బ్యాటింగ్ లో నెమ్మదించింది. వరుసగా ఓపెనర్లు అవుట్ కావడంతో ఆచి తూచి ఆడుతోంది. తొలుత భారీ షాట్లతో విజృంభించి ఆడతున్న ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (29; 17 బంతుల్లో 4×6)ను శార్దూల్‌ ఠాకూర్‌ ఔట్‌ చేశాడు. ఐదో ఓవర్‌ చివరి బంతిని ఆడబోయిన డికాక్‌ కీపర్‌ ధోనీకి క్యాచ్‌ ఇచ్చాడు. దీపక్‌ చాహర్‌ వేసిన ఆరో ఓవర్‌ రెండో బంతికి రోహిత్‌ శర్మ (15; 14 బంతుల్లో 1×4, 1×6) పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం ముంబయి నిలకడగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (7; 10 బంతుల్లో), ఇషాన్‌ కిషన్‌ (5; 13 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నారు. వికెట్లు పడకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క చెన్నై బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories