హృదయాలను గెలిచాడు!వింటున్నావా సంజయ్!

హృదయాలను గెలిచాడు!వింటున్నావా సంజయ్!
x
Highlights

విజయాన్ని సంపాదించి పెట్టలేకపోవచ్చు.. కానీ, అతని ప్రయత్నం అద్వితీయం.. విజయదరహాసం చేసే అవకాశం అతనికి దొరికి ఉండకపోవచ్చు.. అయితే, క్లిష్ట పరిస్థితుల్లో...

విజయాన్ని సంపాదించి పెట్టలేకపోవచ్చు.. కానీ, అతని ప్రయత్నం అద్వితీయం.. విజయదరహాసం చేసే అవకాశం అతనికి దొరికి ఉండకపోవచ్చు.. అయితే, క్లిష్ట పరిస్థితుల్లో అతని తెగువ అనిర్వచనీయం. అతనే రవీంద్ర జడేజా. సెమీఫైనల్స్ లో నిప్పులు చెరిగే బంతులతో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగిపోతుంటే.. ఏ మాత్రం సహకరించని పిచ్ ఒక పక్క.. ప్రత్యర్థుల అద్భుత పీల్డింగ్ మరోపక్క ఇబ్బందులు పెడుతుంటే.. టీమిండియా మహామహులు చేతులెత్తి చక్కా వెళ్ళిపోతే.. నేనున్నానంటూ తోడుగా నిలిచిన కూల్ ధోనీ సహకారంతో న్యూజిలాండ్ టీం కు చమటలు పట్టించాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా జడేజా పై ప్రశంసల వర్షమే కురుస్తోంది. ఈ మ్యాచ్ లో జదేజాను ఆడించ కూడదంటూ చెప్పిన సంజయ్ మంజ్రేకర్ కూడా జడేజా నువ్వు సూపర్ అంటూ కితాబులిస్తున్నాడు.

ఈ వరల్డ్ కప్ ప్రారంభం నుంచీ సంజయ్ మంజ్రేకర్ జదేజాను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్లు చేస్తున్నాడు. సెమీస్ ముందు కూడా జడేజా కి తుది జట్టులో స్థానం దొరకకపోవచ్చంటూ కామెంట్ చేశాడు. ఈ విషయంలో అభిమానులు సంజయ్ ను విపరీతంగా ట్రోల్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు జడేజా అద్భుత ఇన్నింగ్స్ చూసి వెల్ డన్ జడేజా అంటూ ట్వీటాడు. అయితే, కనీసం ఆ ట్వీట్ కు జదేజాను ట్యాగ్ కూడా చేయలేదు. దాంతో నెటిజన్లు సంజయ్ ని టార్గెట్ చేశారు. జడేజా ను ఎంత పోగుడుతున్నారో.. అంతగానూ సంజయ్ ను విమర్శిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. 'గల్లీ క్రికెటర్‌ అన్నావు కదా ఇప్పుడేమంటావ్‌', ' 1983 ప్రపంచకప్‌ సెమీస్‌లో కపిల్‌దేవ్‌ ఆటను జడేజా గుర్తుచేశాడు', 'ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదని ఈ మ్యాచ్‌తో మంజ్రేకర్‌కు అర్దమైందనుకుంటా', 'నీ అసాధారణ పోరాటంతో టీమిండియా భారీ ఓటమి నుంచి తప్పించి పరువు కాపాడావు', 'నిజమైన త్రీ డైమెన్షన్‌ ప్లేయర్‌ అంటే జడేజానే' అంటూ నెటిజన్లు జడేజాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories