సచిన్‌ గురువు అచ్రేకర్‌ ఇకలేరు

సచిన్‌ గురువు అచ్రేకర్‌ ఇకలేరు
x
Highlights

క్రికెట్‌ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌(87) కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.....

క్రికెట్‌ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్‌ గురువు రమాకాంత్‌ అచ్రేకర్‌(87) కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముంబైలో దాదార్‌లోని శివాజీరాజ్ పార్కులో అచ్రేకర్‌ ఎందరో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చారు. వారిలో టీమిండియా ఆణిముత్యం సచిన్‌ టెండూల్కర్‌ అలాగే గ్రేట్ ఆటగాడు వినోద్‌ కాంబ్లీ వంటి దిగ్గజ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చారు. క్రికెట్‌ రంగంలో అసమాన సేవలందించినందుకు గాను కేంద్రప్రభుత్వం ఆయనకు 1990లో ద్రోణాచార్య అవార్డుతో, 2010లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.

కాటన్‌ చొక్కా, సాధారణ ట్రౌజర్‌తోపాటు 'జువెల్‌ థీఫ్‌'లో దేవానంద్‌ తరహా క్యాప్‌ ధరించి అత్యంత సాధారణంగా ఉండే రమాకాంత్‌లో క్రికెట్‌ పరిజ్ఞానం అపారం. ఆయన శిష్యరికం లభించడం ఆషామాషీ కాదు. నిబంధనల విషయంలో అచ్రేకర్‌ ఎంతో కఠినంగా ఉంటారని సచిన్ టెండూల్కర్ పలుమార్లు వ్యాఖ్యానించారు. గురుపౌర్ణిమ సందర్భంగా అంద‌రూ గుడికి వెళ్లి దేవుడ్ని దర్శించుకుంటే.. సచిన్ మాత్రం తన గురువైన రమాకాంత్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకుంటాడు. అచ్రేకర్‌ మృతి పట్ల సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అచ్రేకర్‌ కు సంతాపం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories