రెండో వన్డే ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ..?

రెండో వన్డే ముందు టీమిండియాకు ఎదురు దెబ్బ..?
x
Rishabh pant File Photo
Highlights

ఆస్ట్రేలియాలతో జరిగిన మొదటి వన్డేలో భారత్ భారీ షాక్ తగిలినసంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది.

ఆస్ట్రేలియాలతో జరిగిన మొదటి వన్డేలో భారత్ భారీ షాక్ తగిలినసంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రెండో వన్డే ముందు టీమిండియా కీలక ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయం కారణంగా మ్యాచ్ దూరం కానున్నాడు. మంగళవారం జరిగిన తొలి వన్దేలో బ్యాటింగ్ చేస్తూ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రిషబ్ పంత్ స్థానంలో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. తొలి వన్డేలో ఆస్ట్రేలియా పేస్ బౌలర్ కమిన్స్ విసిరిస ఓ బంతిని ఫుల్ ఆడబోయిన పంత్ గాయపడ్డాడు. కమిక్స్ విసిన బంతి పంత్ బ్యాట్ ఎడ్జ్ తాకి హెల్మెట్ కు బలంగా తాకి క్యాచ్ వెళ్లింది. ఫీల్డింగ్ చేస్తు్న్న టర్నర్ సులువుగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో పంత్ క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. అయితే అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఇది గమనించని పంత్ రిప్లై చూసి వెనుదిరిగాడు. రిషబ్ పంత్‌ని తొలుత వైద్యులు పరీక్షిచారు. కామిక్స్ విసిరిన బంతి పంత్ తలకు తాకడంతో గాయమైందని గుర్తించారు. దీంతో రెండు విశ్రాంతి అవసరమని తెలిపారు. ఫిల్డీంగ్ సమయంలో భారత్ పంత్ బదులుగా మనీశ్ పాండేని సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా తీసుకుంది. రిషబ్ పంత్ స్థానంలో కీపింగ్ చేయగల అనుభవం ఉన్న రాహుల్ కీపింగ్ తీసుకున్నాడు.

ముంబయి నుంచి భారత జట్టు బుధవారం రాజ్‌కోట్‌కి బయల్దేరింది. రిషబ్ పంత్ మాత్రం ముంబైలోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. దీంతో 17న జరగనున్న రెండో వన్డే మ్యాచ్ లో రిషబ్ పంత్ స్థానంలో మనీశ్ పాండేని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే తొలి వన్డేలో రిషబ్ పంత్ 28 పరుగులు చేశాడు. జాడేజాతో కలిసి ఆరో వికెట్ కు50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. దీంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. వెస్టిండీస్ టూర్ తో ఫామ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ గాయంబరిగిన పడడంతో సిరీస్ సమం చేయాలని భావిస్తోన్న భారత్ కు పెద్ద దెబ్బతగిలిందని చెప్పోచ్చు. ఇప్పటికే ఈ సిరీస్ తొలి వన్డే విజయం సాధించి ఆసీస్ 1-0తో ముందజలో ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories