Top
logo

పట్టు బిగిస్తున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. 20 ఓవర్లకు పాక్ స్కోర్ 111 / 1

పట్టు బిగిస్తున్న ఇంగ్లాండ్ బౌలర్లు.. 20 ఓవర్లకు పాక్ స్కోర్ 111 / 1
Highlights

వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు క్రమేపీ తమ పట్టు బిగిస్తున్నారు....

వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ బౌలర్లు క్రమేపీ తమ పట్టు బిగిస్తున్నారు. వికెట్ నష్టపోకుండా పది ఓవర్లకు 69 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న పాకిస్థాన్ కు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారీ స్కోరు చేయకుండా ప్రయత్నం చేస్తునారు. మార్క్ వుడ్ అద్భుతమైన బౌలింగ్ తో పాకిస్థాన్ జోడీని పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. తరువాత మోయిన్ అలీ 15 వ వోవర్లో పాక్‌ ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ (36; 40 బంతుల్లో) పెవిలియన్ కు పంపించాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన బాబర్ అజాం సహాయంతో మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ మరో వికెట్ పడకుండా జాగ్రతగా ఆడుతున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 111 పరుగులు చేశారు.

Next Story