ఆ జాబితాలో మన దేశం నుంచి మన సింధు మాత్రమే!

ఆ జాబితాలో మన దేశం నుంచి మన సింధు మాత్రమే!
x
Highlights

మన దేశం నుంచి ఫోర్బ్స్ జాబితాలో పీవీ సింధు ఒక్కరి పేరు మాత్రమే మహిళా క్రీడాకారిణులలో అధిక సంపాదన కలిగిన వారిగా చేరింది.

బ్యాడ్మింటన్‌ సంచలనం... తెలుగు తేజం పివి సింధు ఒలింపిక్స్‌ వంటి క్రీడల్లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రియో ఒలింపిక్స్‌ తృటిలో స్వర్ణం కోల్పోయిన రెండో స్థానలో నిలిచి రజతాన్ని గెలుచుకుంది. దీంతో ఒక్కసారిగా సింధుకు క్రేజ్‌ పెరిగిపోయింది. అంతేకాక తన బ్రాండ్‌ వాల్యూ కూడా

అమాతం ఆకాశానికి ఎగబాకింది. దీంతో సింధు ఏకంగా పోర్చ్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. 2018-19 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యధిక వార్షికాదాయం కలిగిన మహిళా క్రీడాకారుల జాబితాను వాటి ఆధారంగా ర్యాంకింగ్‌ ఇవ్వడం జరిగింది. ఇందులో టాప్‌ 15లో సింధు చోటు దక్కించుకుంది. భారత్‌ నుండి సింధు ఒక్కరే ఈ జాబితాలో ఉండడం విశేషం. సింధు 5.5 మిలియన్‌ డాలర్లతో 13వ స్థానంలో ఉంది. ఇందులో 29.2 మిలియన్‌ డాలర్స్‌ తో అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ టాప్‌ లో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories