ఒక్క గెలుపూ దక్కలేదు!

ఒక్క గెలుపూ దక్కలేదు!
x
Highlights

ఒక్కటంటే ఒక్కటి కూడా విజయాన్ని పొందలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్. నాకౌట్ దశకు చేరుతుందనే అంచనాలు లేని చిన్న జట్టే అయినా, లీగ్ లో ఒకటి రెండు విజయాలనైనా...

ఒక్కటంటే ఒక్కటి కూడా విజయాన్ని పొందలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్. నాకౌట్ దశకు చేరుతుందనే అంచనాలు లేని చిన్న జట్టే అయినా, లీగ్ లో ఒకటి రెండు విజయాలనైనా సాధించి సంచలనం సృష్టించే అవకాశాలున్నాయని అంచనాలు వేశారు క్రికెట్ పండితులు. కనీసం వెస్టిండీస్ జట్టు మీద గెలిచే అవకాశాలున్నాయని లేక్కలేశారు. ఎందుకంటే, ప్రపంచకప్ క్వాలిఫై టోర్నీలో వెస్టిండీస్ ను చిత్తు చేసింది అఫ్ఘన్ జట్టు. అయితే, గురువారం జరిగిన చివరి మ్యాచ్ లో విండీస్ అందుకు బదులు తీర్చుకుంది. దీంతో కనీసం ఒక్క మ్యచూ గెలవకుండానే ఇంటి ముఖం పట్టింది ఆఫ్ఘనిస్తాన్.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు, 311 పరుగులు చేసి భారీ సవాలే విసిరింది ఆఫ్ఘనిస్తాన్ కు. అయితే, చేదనలో ఆఫ్ఘన్ జట్టు మంచి పోరాటపటిమను ప్రదర్శించింది. కానీ, 23 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట విండీస్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' షై హోప్‌ (92 బంతుల్లో 77; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, నికోలస్‌ పూరన్‌ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. దౌలత్‌ జద్రాన్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 50 ఓవర్లలో 288 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇక్రమ్‌ అలిఖిల్‌ (93 బంతుల్లో 86; 8 ఫోర్లు), రహ్మత్‌ షా (78 బంతుల్లో 62; 10 ఫోర్లు) రాణించాడు. బ్రాత్‌వైట్‌ 4 వికెట్లు తీశాడు.

ప్రపంచ కప్ టోర్నీలో విండీస్ కు ఇది రెండో విజయం మాత్రమె.

స్కోర్లు..

వెస్టిండీస్‌ ‌: గేల్‌ (సి) ఇక్రమ్‌ (బి) దౌలత్‌ 7; లూయిస్‌ (సి) నబీ (బి) రషీద్‌ఖాన్‌ 58; షైహోప్‌ (సి)రషీద్‌ఖాన్‌ (బి) నబీ 77; హెట్‌మైర్‌ (సి) సబ్‌– నూర్‌ అలీ (బి) దౌలత్‌ 39; పూరన్‌ రనౌట్‌ 58; హోల్డర్‌ (సి) దౌలత్‌ (బి) సయద్‌ 45; బ్రాత్‌వైట్‌ నాటౌట్‌ 14; అలెన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 311.

బౌలింగ్‌: ముజీబ్‌ 10–0–52–0, దౌలత్‌ 9–1–73–2, సయద్‌ 8–0–56–1, నైబ్‌ 3–0–18–0, నబీ 10–0–56–1, రషీద్‌ఖాన్‌ 10–0–52–1.

అఫ్గానిస్తాన్‌ ‌: నైబ్‌ (సి) లూయిస్‌ (బి) రోచ్‌ 5; రహ్మత్‌ షా (సి) గేల్‌ (బి) బ్రాత్‌వైట్‌ 62; ఇక్రమ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) గేల్‌ 86; నజీబుల్లా రనౌట్‌ 31; అస్గర్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 40; నబీ (సి) అలెన్‌ (బి) రోచ్‌ 2; సమీవుల్లా (సి) హెట్‌మైర్‌ (బి) రోచ్‌ 6; రషీద్‌ ఖాన్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రాత్‌వైట్‌ 9; దౌలత్‌ (సి) కాట్రెల్‌ (బి) బ్రాత్‌వైట్‌ 1; సయద్‌ (సి) అలెన్‌ (బి) థామస్‌ 25; ముజీబ్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్‌) 288.

బౌలింగ్‌: కాట్రెల్‌ 7–0–43–0, రోచ్‌ 10–2–37–3, థామస్‌ 7–0–43–1, హోల్డర్‌ 8–0–46–0, అలెన్‌ 3–0–26–0, బ్రాత్‌వైట్‌ 9–0–63–4, గేల్‌ 6–0–28–1.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories