Arjuna Award: అర్జున అవార్డుకు ఎంపికైన నిఖత్ జరీన్, శ్రీజ

* శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

R Tripura Malini
Published on: 17 Nov 2022 7:27 AM IST
Nikhat Zareen and Akula Sreeja are selected for the Arjuna Award
X

అర్జున అవార్డుకు ఎంపికైన నిఖత్ జరీన్, శ్రీజ

Arjuna Award: ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు ఎంపికైన రాష్ట్ర యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌తో పాటు టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆకుల శ్రీజకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిభకు తగిన గుర్తింపునిస్తూ కేంద్ర క్రీడాశాఖ నిఖత్‌, శ్రీజను అర్జునకు ఎంపిక చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నిఖత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌తో పాటు కామన్వెల్త్‌ గేమ్స్‌లో పసిడి పతకంతో తెలంగాణ బిడ్డగా యావత్‌ దేశం గర్వపడేలా చేశావని కొనియాడారు.

ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లో మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. టేబుల్‌ టెన్నిస్‌లో శ్రీజ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నదని కామన్వెల్త్‌ గేమ్స్‌లో పోటీకి దిగిన తొలిసారే పసిడి పతకంతో సత్తాచాటావని అన్నారు. అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ శ్రీజ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. మరోవైపు ఈ సందర్భంగా నిఖత్‌, శ్రీజకు క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story