ఫ్లడ్‌లైట్లుకు డబ్బులు లేవు.. కశ్మీర్‌ కావాలా !

ఫ్లడ్‌లైట్లుకు డబ్బులు లేవు.. కశ్మీర్‌ కావాలా !
x
Highlights

దశాబ్ద కాలం తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై మొదటి వన్డే మ్యాచ్‌ జరిగింది. శ్రీలంకపై జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ 67 పరుగులతో ఘన విజయం సాధించింది. 2009లో పాక్ లో పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి జరిగిన దాడి జరిగింది . లాహోర్‌లోని స్టేడియం వద్ద 12 మంది ముష‌్కరులు శ్రీలంక క్రికెటర్లు పర్యటిస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ఇప్పటి వరకూ కూడా పాక్ గడ్డపై ఏ క్రికెట్ జట్టు అడుగుపెట్టలేదు. తిరిగి అదే శ్రీలంక క్రికెట్ జట్టు పాక్ లో అడుగు పెట్టింది. ఈ సారి శ్రీలంక టీంలో కీలక ఆటగాళ్లు దూరం అయ్యారు. అయినప్పటికీ పాక్ లో అడుగు పెట్టిన శ్రీలంక క్రికెట్ జట్టు ఆటగాళ్లకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ కల్పించడంపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

లంక ఆటగాళ్లను బసచేస్తున్న హోటల్‌ నుంచి వారిని స్టేడియానికి తీసుకెళ్లేందుకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపివేశారు. కాన్వాయ్ చూట్టు పాక్ జవాన్లను మోహరించారు. జవాన్లు భారీగా ఉండడంతో నెటిజన్లు సటైర్లు పెలుస్తున్నారు.

అయితే ఒ మ్యాచ్ లో ఫ్లడ్‌లైట్లు సరిగ్గా లేనందుకు నిలిచిపోయింది. రెండో మ్యాచ్ కరాచీ స్టేడియంలో నిర్వహించారు. ఫ్లడ్‌లైట్లు సరిగ్గా వెలిగించేందుకు డబ్బులు లేవు, కశ్మీర్‌ కావాలా అని ఓ నెటిజన్‌ సెటైర్ వేశారు. కరాచీలో కర్ఫ్యూ విధించి మ్యాచ్‌ ఆడినట్లుందని మరో నెటిజన్ సటైర్ వేశారు. అయితే భారీ భద్రత కారణంగా ఈ మ్యాచ్ కు అనుకున్న అంతగా వీక్షకులు రాలేదు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.

మొత్తానికి ఎట్టకేలకు కరాచీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ భారీ విజయం నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆజట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కొల్పోయి 305 పరుగులు చేసింది. శ్రీలంక జట్టు 238 (46.5) పరుగులకు ఆలౌటైయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories