యూవీ నువ్వో సంపూర్ణ విజేతవి : కోహ్లీ భావోద్వేగం

యూవీ నువ్వో సంపూర్ణ విజేతవి : కోహ్లీ భావోద్వేగం
x
Highlights

రిటైర్మెంట్ ఏ రంగంలోని వారికైనా ఉద్విఘ్నభరితమైన ఘట్టమే! తమ వృత్తిగత జీవితానికి వీడ్కోలు చెప్పే వేళలో వారికి స్వయంగా ఎంత ఉద్వేగంగా ఉంటుందో అంతకు మించిన...

రిటైర్మెంట్ ఏ రంగంలోని వారికైనా ఉద్విఘ్నభరితమైన ఘట్టమే! తమ వృత్తిగత జీవితానికి వీడ్కోలు చెప్పే వేళలో వారికి స్వయంగా ఎంత ఉద్వేగంగా ఉంటుందో అంతకు మించిన ఉద్వేగం ఆ వ్యక్తి సహచరుల్లో కూడా ఉంటుంది. క్రీడాకారుల విషయంలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంటుంది.


ఈరోజు భారత లెజండ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. టీమిండియా కు వెన్నెముకలా సేవలందించి యూవీ గా ముద్దుగా పిలిపించుకునే ఈ యోధుడి రిటైర్మెంట్ వార్త ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అభిమానుల ఉద్వేగానికి అంతులేకుండా పోయింది. అభిమానులకే అంత ఉద్విగ్న పరిస్థితి ఉంటె.. యూవీ సహచరులకు ఎంతగా ఉంటుందో ఊహించవచ్చు.

ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలో బిజీగా ఉంది. ఈ టోర్నీలో మన జట్టుకి సారధ్యం వహిస్తున్న కోహ్లీ తన భావోద్వేగాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు.

'అభినందనలు పాజీ. దేశం తరుపున అద్భుతమైన క్రికెట్‌ ఆడావు. ఎన్నో అద్భుతమైన మధుర జ్ఞాపకాలతో పాటు గొప్ప విజయాలను మాకు అందించావు. నీకు ఆల్‌ ద బెస్ట్‌. నిజమైన, సంపూర్ణ విజేత'అంటూ కోహ్లి భావోద్వేగమైన ట్వీట్‌ చేశాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories