ఆటలు నేర్చుకోవద్దని పిల్లలకు న్యూజిలాండ్ క్రికెటర్ సలహా!

ఆటలు నేర్చుకోవద్దని పిల్లలకు న్యూజిలాండ్ క్రికెటర్ సలహా!
x
Highlights

అదృష్టం చిన్నచూపు చూసిన వేళ కలలు కల్లలయితే.. ఆ బాధ ఎవరికీ చెప్పరానిది. అందులోనూ ప్రపంచ చాంపియన్లుగా నిలవాల్సిన వారు.. కేవలం కొద్ది పాటి తేడాతో ఓటమి...

అదృష్టం చిన్నచూపు చూసిన వేళ కలలు కల్లలయితే.. ఆ బాధ ఎవరికీ చెప్పరానిది. అందులోనూ ప్రపంచ చాంపియన్లుగా నిలవాల్సిన వారు.. కేవలం కొద్ది పాటి తేడాతో ఓటమి పాలైతే.. ఆ ఆటగాళ్ల వ్యధ ఎంత ఉంటుందో లెక్క వేయలేం. ఇప్పడు న్యూజిలాండ్ క్రికెటర్ల పరిస్థితి అలానే ఉంది. వెంట్రుక వాసిలో విజయాన్ని కోల్పోయిన వారు తమ బాధను ట్వీట్ల రూపంలో ప్రపంచంతో పంచుకుంటున్నారు.

ఆ క్రమంలో న్యూజిలాండ్ క్రికెటర్ నీషం తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశాడు. పిల్లలూ ఆటలు నేర్చుకోకండి. దానికి బదులుగా బేకింగ్ వంటివి నేర్చుకోండి. అరవై ఏళ్ళు ఆనందంగా బ్రతకండి అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. దానికి నేతిజన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. బాధ పడవద్దంటూ నీషంను అభిమానులు

ఒడారుస్తున్నారు. నీ ఆటతీరుతో నీవు విజేతవే. మా అందరికీ నిన్ను చూస్తె గర్వంగా ఉంది. అంటూ ఆ ట్వీట్ కు జవాబిస్తున్నారు. సూపర్ ఓవర్లో సూపర్ సిక్స్ కొట్టి నీషం గెలుపు ముందుకు కివీస్ ను తీసుకువచ్చాడు. అంత ఒత్తిడిలోనూ అతను కొట్టిన సిక్స్ గురించి ఇపుడు నెటిజన్లు విపరీతంగా చెప్పుకుంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories