Ind vs WI 2nd T20 : విండీస్ లక్ష్యం 171

Ind vs WI 2nd T20 : విండీస్ లక్ష్యం 171
x
India vs West Indies,
Highlights

తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 ఆరంభమైంది. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రిషబ్ పంత్...

తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య రెండో టీ20 ఆరంభమైంది. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (33, 22 బంతుల్లో 3X4, 1X6) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. శివమ్ దూబే (54, 30 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్సు) హేడెన్ వాల్ష్ బౌలింగ్ లో హెట్‌మైర్ క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. శివమ్ దూబే టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. కోహ్లీ (19) పరుగులతో నిరాశపరిచాడు. కేస్రిక్ విలియమ్స్ బౌలింగ్ లో లెండిల్ సిమన్స్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. అనంతరం శ్రేయస్స్ అయ్యార్ (10) భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. మొదట భారీ స్కోరు సాధిస్తుందనుకున్న భారత్ ను విండీస్ బౌలర్ల వ్యూహాత్మకంగా కట్టడి చేశారు.

మొదట టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు ఆదిలోనే కీలక వికెట్ కోల్పోయింది. 3.1 ఓవర్లలో జట్టు స్కోరు 24 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్ రాహుల్ (11 పరుగులు, 11 బంతుల్లో, 1ఫోర్ ) చేసి ఖ్యారీ పిర్రే బౌలింగ్ లో హెట్‌మైర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి మ్యాచ్ లో రాణించిన రాహుల్ ఈ మ్యాచ్ లో స్వల్ప పరుగులకే ఔటైయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ( 15 పరుగులు,18బంతుల్లో,2 ఫోర్లు) పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విండీస్ బౌలర్లలో కేస్రిక్ విలియమ్స్, హేడెన్ వాల్ష్ చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. జాసన్ హోల్డర్, ఖ్యారీ పిర్రే, జాసన్ హోల్డర్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు.

హైదరాబాద్ వేధికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌కు టీమిండియా 6వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియాల వెస్టిండీస్ మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేచించిన భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 94 పరుగులు,50బంతుల్లో, 6 ఫోర్లు, 6సిక్సులు)తో విండిస్ బౌలర్లపై విరుచుపడ్డాడు. విండీస్ ఉంచిన 208పరుగల లక్ష్యాన్ని మరో 8బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories