రెండో వన్డేలో భారత్ విజయం..

రెండో వన్డేలో భారత్ విజయం..
x
Highlights

టీమిండియా వెస్టిండీస్ టూర్‌లో భాగంగా వన్డే సిరీస్ లో రెండో వన్డే నిన్న జరిగింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఇంగ్లండ్‌లో జరిగిన అండర్‌–19 ముక్కోణపు క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టీమిండియా వెస్టిండీస్ టూర్‌లో భాగంగా వన్డే సిరీస్ లో రెండో వన్డే నిన్న జరిగింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఇంగ్లండ్‌లో జరిగిన అండర్‌–19 ముక్కోణపు క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ, భువనేశ్వర్ చక్కటి ఆటతీరుతో భారత జట్టుకి ఘన విజయం అందించడంలో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఇక వెస్టిండీస్ 42 ఓవర్లలో 210 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

ఈసారి టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఆతిథ్య జట్టు కుదేలైంది. ఫలితంగా సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 120 పరుగులు చేశాడు. 112 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. ఫలితంగా వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. సెంచరీతో కదం తొక్కిన కోహ్లీకి మేన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0తో బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా మూడో వన్డే ఈ నెల 14న జరగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories