logo

బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..

బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా..
Highlights

బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఆ జట్టు సారథి ఆరోన్‌ ఫించ్‌...

బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. ఆ జట్టు సారథి ఆరోన్‌ ఫించ్‌ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. విశాఖలో ఆదివారం జరిగిన మొదటి టి20లో భారత బౌలర్ల వైఫల్యంతో ఆస్ట్రేలియా జట్టు చిట్టచివరి బంతికి అనూహ్య విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది ఆసీస్. ఈ క్రమంలో బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో మ్యాచ్ లోనూ విజయం సాధించి, భారత గడ్డపై మొట్టమొదటి టి20 సిరీస్ గెలవాలని కంగారూలు ఆశ పడుతున్నారు. అయితే టీమిండియా మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చెయ్యాలని భావిస్తోంది. కాగా టి20 ప్రపంచ ర్యాంకింగుల్లో 123 పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో వుంటే, 119 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో ర్యాంకులో ఉంది.


లైవ్ టీవి


Share it
Top