విండీస్ ని కూల్చేశారు..

విండీస్ ని కూల్చేశారు..
x
Highlights

టీమిండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు వెస్ట్ ఇండీస్ టీముకు. ఛేదన మొదలు పెట్టిన దగ్గర నుంచీ ఎక్కడా కుదురుకునే అవకాశమే...

టీమిండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం ఎంతో సేపు నిలవలేదు వెస్ట్ ఇండీస్ టీముకు. ఛేదన మొదలు పెట్టిన దగ్గర నుంచీ ఎక్కడా కుదురుకునే అవకాశమే విండీస్ బ్యాట్స్ మెన్ కు దక్కలేదు. పరుగులు రావడం కష్టమైపోయింది.. వికెట్లను నిలబెట్టుకోవడమూ ఇబ్బందిగా మారిపోయింది. మొదట షమీ చెలరేగాడు. తొలి స్పెల్ లో రెండు కీలక వికెట్లు తీసి విండీస్ ను కట్టడి చేశాడు. ఇదే సమయంలో బుమ్రా వికెట్లు రాకపోయినా పరుగులు ఇవ్వకుండా విండీస్ బ్యాట్స్ మెన్ ను ఇరుకున పెట్టాడు. తరువాత కొద్దిసేపు మూడో వికెట్ కు 50 పరుగుల పైచిలుకు భాగస్వామ్యాన్ని అంబ్రోస్, పూరన్ నిలబెట్టినా.. పాండ్యా వారిద్దరినీ విడదీశాడు. దాంతో ఇక విండీస్ ఎక్కడా కుదురుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. పూరన్, హెట్ మేయర్ కొంత ఆడేలా కనిపించినా.. కులదీప్ పూరన్ ను పెవిలియన్ చేర్చడంతో విండీస్ ఆశలు దాదాపుగా ఆవిరి అయిపోయాయి. ఒత్తిడితో మిగిలిన బ్యాట్స్ మెన్ బ్యాట్ కు పనిచేప్పలేకపోయారు. కాదు.. చెప్పే అవకాశాన్ని భారత బౌలర్లు ఇవ్వలేదు. మొత్తమ్మీద విండీస్ జట్టు 34.2 ఓవర్లలో 143 పరుగులకు కుప్పకూలింది. భారత జట్టు 125 పరుగుల భారీ విజయాన్ని సవంతం చేసుకుంది. భారత జట్టులో షమీ 4 వికెట్లూ, బుమ్రా 2 వికెట్లూ, చాహల్ 2 వికెట్లూ, పాండ్య, కుల్దీప్ చెరో వికెట్ తీసి విండీస్ ను కోలుకొని దెబ్బ తీశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories