నేడే వరల్డ్ కప్ ఫైనల్.. అస్త్ర, శస్త్రాలు సిద్దం చేసిన కివీస్, ఇంగ్లాండ్

నేడే వరల్డ్ కప్ ఫైనల్.. అస్త్ర, శస్త్రాలు సిద్దం చేసిన కివీస్, ఇంగ్లాండ్
x
Highlights

వరల్డ్ కప్ 2019టోర్నీ మరి కొద్ది గంటల్లో ముగియనుంది. భారీ అంచనాలతో 45 రోజుల పాటు సాగిన ఈ టైటిల్ పోరు ఫైనల్‌ దశకు వచ్చేసింది. నేడు ఇంగ్లండ్‌,...

వరల్డ్ కప్ 2019టోర్నీ మరి కొద్ది గంటల్లో ముగియనుంది. భారీ అంచనాలతో 45 రోజుల పాటు సాగిన ఈ టైటిల్ పోరు ఫైనల్‌ దశకు వచ్చేసింది. నేడు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు ఢీ కొంటున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి వరల్డ్ కప్ ను ముద్దాడాలని ఇరు జట్లూ తహతహలాడుతున్నాయి. వరల్డ్ కప్ సమరం తుది దశకు చేరుకుంది.అమీతుమీ తేలుచుకునేందుకు న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లు సిద్ధమయ్యాయి. లండన్‌లో లార్డ్స్‌ వేదికగా జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు అస్త్ర, శస్త్రాలను రెడీచేస్తున్నారు.

ఇప్పటి దాకా వరల్డ్ కప్‌ను ముద్దాడని కివీస్, ఇంగ్లండ్ ఫైనల్ బరిలో నిలిచాయి. 27 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడంతో ఆ దేశ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. క్రికెట్‌ పుట్టినిల్లుగా పేరున్న ఇంగ్లాండ్‌ ఇప్పటివరకూ ప్రపంచకప్‌ దక్కించుకోకపోయినా సొంతగడ్డపై జరుగుతున్న పోరులో విజేతగా నిలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది. ఈసారి కప్ సాధించి విశ్వవిజేతగా నిలిస్తే వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ పేరు కూడా చేరిపోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories