అందుకే నగ్నంగా.. మహిళా క్రికెటర్ సంచలనం!

సారా టేలర్.. ప్రముఖ ఇంగ్లాండ్ క్రికెట్ క్రీడా కారిణి. అకస్మాత్తుగా ఇంస్టాగ్రామ్ లో నగ్నంగా దర్శనమిచ్చి సంచలనం సృష్టించింది. కేవలం మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికే ఈ విధంగా చేసానని వివరణ ఇచ్చింది.
ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ లో సారా టేలర్ సూపర్ ప్లేయర్. వికెట్ కీపింగ్ లో దిట్ట. బ్యాటింగ్ లో ఆదరగోట్టేస్తుంది. మొన్న ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో ఇండియా టీముకు పరాజయాన్ని అందించింది ఆమె. ఈ మధ్య ఆమె కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉంది. వ్యక్తిగతంగానూ చిక్కుల్లో ఉండడంతో క్రికెట్ ఆట తగ్గించుకుంది.
అయితే, అకస్మాత్తుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. అలా ఇలా కాదు ఏకంగా నగ్నంగా. దుస్తులేమీ లేకుండా వికెట్ కీపింగ్ చేస్తున్న తన చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. మహిళల దేహానికి సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆమెను ఉమెన్స్‌హెల్త్ యూకే ఆహ్వానించింది. ఈ సందర్భంగా మహిళలకు అవగాహన కల్పించడానికే ఈ పని చేసినట్టు ఆమె పేర్కొంది.
'నా గురించి తెలిసిన వారెవ్వరైనా నేను కంఫర్ట్‌జోన్ నుంచి కాస్త బయటకు వచ్చినట్టు తెలుసుకుంటారు. అయితే మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఉమెన్స్‌హెల్త్ యూకేకు ధన్యవాదాలు. నా దేహంతో నేనెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్నింటిని అధిగమించాను. మహిళా సాధికారతను సాధించాను. చూసేందుకు ప్రతి అమ్మాయి బాగుంటుంది! దయచేసి గుర్తుంచుకోండి ప్రతి అమ్మాయి అందమైందే' అంటూ సారా టేలర్ తన నగ్న చిత్రానికి వివరణ ఇచ్చింది.
లైవ్ టీవి
'శ్రీనివాస్‌రెడ్డిని కూడా ఎన్కౌంటర్ చేయాలి'
7 Dec 2019 9:20 AM GMTఉన్నావ్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంక
7 Dec 2019 9:08 AM GMTప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జె.సి యాదిరెడ్డి
7 Dec 2019 9:03 AM GMTఢిల్లీలోని సఫ్తర్‌జంగ్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. ఆస్పత్రి...
7 Dec 2019 8:30 AM GMTతెలంగాణలో ఒక్కో ఎన్ కౌంటర్ లో ఒక్కో కథ
7 Dec 2019 8:15 AM GMT