ప్రపంచ కప్ లో మొదలైన ఇంగ్లాండ్ పరుగుల వరద..

ప్రపంచ కప్ లో మొదలైన  ఇంగ్లాండ్ పరుగుల వరద..
x
Highlights

అనుకున్నట్టుగానే ప్రపంచ కప్ లో పరుగుల మోత మొదలైంది. ఈరోజు ఓవల్ లో ప్రపంచ కప్ క్రికెట్ తోలి మ్యాచ్ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ జట్లమధ్య ఈ...

అనుకున్నట్టుగానే ప్రపంచ కప్ లో పరుగుల మోత మొదలైంది. ఈరోజు ఓవల్ లో ప్రపంచ కప్ క్రికెట్ తోలి మ్యాచ్ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ జట్లమధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచినా సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాన్డ్ జట్టు పరుగుల వరద పారించింది. వికెట్ల మధ్య మంచి భాగస్వామ్యాలు నమోదు చేస్తూ, మూడొందల మార్కును దాటింది. దక్షిణాఫ్రికా బౌలర్ తాహిర్ ఇంగ్లాండ్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని త్వరగానే విడదీశాడు. తానాడిన తొలి బంతికే బెయిర్ స్టా డికాక్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. దీంతో సౌతాఫ్రికా ఫీల్డింగ్ నిర్ణయం కరక్టే అనిపించింది. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన రూట్ తో కలిసి ఓపెనర్ జాసన్ రాయ్ సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ జోడీ ఎక్కడా జోరు తగ్గకుండా బ్యాట్ ఝుళిపించింది. ఇద్దరూ అర్థ సెంచరీలు సాధించారు. ఈ దశలో 53 బంతుల్లో 54 పరుగులు చేసిన రాయ్ ను ఫ్లూక్వాయో అవుట్ చేశాడు. అనంతరం మోర్గాన్ బ్యాటింగ్ కు వచ్చాడు. పెద్ద విరామం లేకుండా నే 59 బంతుల్లో 51 పరుగులు చేసిన రూట్ రబడా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన స్టోక్స్ తో మోర్గాన్ ఇన్నింగ్స్ లో వేగం తగ్గకుండా ఆడారు. మోర్గాన్ కూడా అర్థ సెంచరీ (57 ) చేసి అవుటయ్యాడు. స్టోక్స్79 బంతుల్లో 89 పరుగులు చేశాడు. నలుగురు బ్యాట్స్ మెన్ అర్థ సెంచరీలు సాధించడంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించింది. వన్డేలో ఇటీవలి కాలంలో 300 దాటి పరుగులు చేయడం ఇంగ్లాండ్ కు వరుసగా ఇది ఐదోసారి కావడం విశేషం.

దక్షిణాఫ్రికా బౌలింగ్ లో తాహిర్ రెండు, నిగిడి మూడు, రబడా రెండు, ఫిహ్లుక్వాయో ఒక వికెట్ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories