ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం భారత్ అభిమానుల వైపు చూస్తున్న ఇంగ్లాండ్, కివీస్ అభిమానులు!

ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం భారత్ అభిమానుల వైపు చూస్తున్న ఇంగ్లాండ్, కివీస్ అభిమానులు!
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీ లో చివరి మ్యాచ్ రేపు జరగబోతోంది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ టీమిండియా సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్...

వరల్డ్ కప్ టోర్నీ లో చివరి మ్యాచ్ రేపు జరగబోతోంది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ టీమిండియా సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టింది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఫైనల్స్ లో తలపడబోతున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అభిమానులకు పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. ముఖ్యంగా న్యూజిలాండ్ అభిమానులకు. కివీస్ ఫైనల్స్ కు వస్తుందని వారెవరూ ఉహించలేదు. దాంతో ఫైనల్ మ్యాచ్ టికెట్లు ఎవరూ కొనుక్కోలేదు. ఇటు టీమిండియా అభిమానులు పెద్ద సంఖ్యలో ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు కొనుక్కున్నారు. అంతిమ సమరానికి ఆతిథ్యమిస్తున్న లార్డ్స్ స్టేడియంలో 80 శాతం టికెట్లు భారత అభిమానులే కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇండియా ఫైనల్ కి రాకపోవడంతో వారు స్టేడియం కి వెళ్లి మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో టికెట్లను రీసేల్ చేస్తారని ఐసీసీ ఊహిస్తోంది. అయితే, ఇప్పటివరకూ పెద్దగా రీసేల్ లేకపోవడం కూడా అంచనాలకు అందడం లేదు. ఇప్పుడు న్యూజిలాండ్ అభిమానుల ఆశలన్నీ ఇండియా అభిమానులు రీసేల్ చేసే టికెట్ల మీదే ఉన్నాయి. రీసేల్ లో టికెట్లు కొనాలని కోరుకుంటున్నవాళ్ల సంఖ్య పెరుగుతోందని ఐసీసీ వర్గాలంటున్నాయి. విచిత్రం ఏమిటంటే, ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆడుతున్నా ఆ రెండు జట్ల అభిమానులకు టికెట్లు దొరకని పరిస్థితి తలెత్తింది. టీమిండియా అభిమానులు తమ వద్ద ఉన్న టికెట్లు అమ్మకానికి పెడితే తప్ప ఇంగ్లాండ్, కివీస్ ఫ్యాన్స్ అందరికీ మ్యాచ్ చూసే అవకాశం లభించకపోవచ్చు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories