ఇక్కట్లలో ఇంగ్లాండ్

ఇక్కట్లలో  ఇంగ్లాండ్
x
Highlights

349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ల వికెట్లను పది ఓవర్లలోనే కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును.. రూట్‌,...

349 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ల వికెట్లను పది ఓవర్లలోనే కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును.. రూట్‌, మోర్గాన్‌ నిదానంగా నిలబెడుతూ వచ్చారు. అయితే, క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(9; 17బంతుల్లో) హఫీజ్‌ వేసిన 15ఓవర్‌ ఐదో బంతికి క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. త్తరువాత వచ్చిన స్టోక్స్ సహాయంతో జట్టును నడిపించిన రూట్ ఈ క్రమం లో తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రూట్, స్టోక్స్ ఇద్దరూ ఆచి, తూచి ఆడుతుండడంతో ఇంగ్లాండ్ జట్టు స్కోరు నిదానంగా కదిలింది. ఈ దశలో ఇంగ్లాండ్ కు మరో షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 21 వ ఓవర్లో మాలిక్ బౌలింగ్ లో స్టోక్స్అవుటయ్యాడు. దీంతో 22 ఓవర్లకు 123 పరుగులు చేసిన ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడింది. ఇంకా ఇంగ్లాండ్ విజయానికి 226 పరుగులు కావాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories