సైనికులతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ధోనీ

సైనికులతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ధోనీ
x
Highlights

తన కోరిక మేరకు కాశ్మీర్ లో ఆర్మీతో కలసి పనిచేస్తున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు లడఖ్ లో సైనికుల మధ్య స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. డ్యూటీ ఆఖరి రోజులో భాగంగా లడక్‌కి వెళ్లిన ధోనీ.. అక్కడ ఆర్మీ ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడ చికిత్స పొందుతున్న సైనికులతో ఆప్యాయంగా కాసేపు మాట్లాడాడు.

తన కోరిక మేరకు కాశ్మీర్ లో ఆర్మీతో కలసి పనిచేస్తున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు లడఖ్ లో సైనికుల మధ్య స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. జూలై ఆఖరు వారం నుంచి సైన్యంతో కలసి ఉంటున్న ధోనీకి ఈరోజు అక్కడ ఆఖరు రోజు. పరాచ్యూట్ రెజిమెంట్ లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్నప్పటికీ ధోనీ దక్షిణ కాశ్మీర్ లో సాధారణ సైనికునిలా సేవలందించాడు. సాధారణ సైనికులతో కలిసి బ్యారక్‌లోనే ఈ మాజీ కెప్టెన్ బస చేశాడు. సైనికులతో కలిసి పహారాకాయడం, బందోబస్తుకి వెళ్లడం వంటి బాధ్యతల్ని ధోనీ నిర్వర్తించాడు. ఈరోజుతో ధోనీ ఆర్మీ డ్యూటీ ముగియనుంది.

డ్యూటీ ఆఖరి రోజులో భాగంగా లడక్‌కి వెళ్లిన ధోనీ.. అక్కడ ఆర్మీ ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడ చికిత్స పొందుతున్న సైనికులతో ఆప్యాయంగా కాసేపు మాట్లాడాడు. కల్నల్ హోదాలో ధోనీ అక్కడికి రావడంతో.. సైనికులు గౌరవంగా సెల్యూట్ చేస్తూ కనిపించారు. మొత్తంగా రెండు వారాలకిపైగా ఆర్మీతో కలిసి ధోనీ డ్యూటీ చేయగా.. మధ్యలోనే కాశ్మీర్ విభజన కూడా జరిగింది. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా.. ధోనీ వెరవకుండా గార్డ్ డ్యూటీ సైతం చేయడం అతని అంకితభావానికి నిదర్శనం.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories