ప్రపంచ‌కప్‌లో తొలి హ్యాట్రిక్ వికెట్లు తీసిన భారత బౌలర్ ఇతడే..

ప్రపంచ‌కప్‌లో తొలి హ్యాట్రిక్ వికెట్లు తీసిన భారత బౌలర్ ఇతడే..
x
చేతన్ శర్మ
Highlights

భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ క్రికెటర్ చేతన్ శర్మకు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూసిన రోజు వచ్చింది.

భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజ క్రికెటర్ చేతన్ శర్మకు ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూసిన రోజు వచ్చింది. ప్రపంచంలోని అన్నిక్రికెట్ జట్లు పోటీపడి విజేతగా నిలావాలని పరితపించే సమయం రానే వచ్చింది. మాజీ దిగ్గజ క్రికెటర్ చేతన్ శర్మ క్రికెట్ ప్రపంచ‌కప్‌లో అడుగుపెట్టిన క్షణం. చైతన్ ఆడింది కొన్నిమ్యాచ్‌లైన ప్రపంచ క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ప్రపంచ క్రికెట్‌లో ఏ బౌలర్‌‌కి సాధ్యపడనే ఘనత సొంతం చేసుకున్నాడు. వరల్డ్ కప్ ఆడాలనే అతని కల నేరవేర్చుకోవడమే కాకుండా హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. జనవరి 3న శుక్రవారం చేతన్ శర్మ 54వ పుట్టిన రోజు. అతని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

క్రికెట్ చరిత్రలో ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాలని ప్రతి ఆటగాడి కల. అలాంటి ప్రపంచ కప్‌లో ఆడడం మాములు విషయం కాదు. టీమిండియాలోకి అడుగు పెట్టిన మూడేళ్ల తర్వాత 1987లో కలిల్ దేవ్ నేతృత్వంలోని జట్టులో ఆడాడు చేతన్. కలిల్ కెప్టెన్ గా ఉన్న సమయంలో జట్టుకు కీలకమైన సమయంలో చైతన్ శర్మ సేవలు ఉపయోగించుకునేవాడు. అయితే 1984లో పాకిస్థాన్‌పై మొదటి టెస్టు మ్యాచ్ ఆడిన శర్మ మొదటి ఓవర్ ఐదో బంతికి పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ మోషిన్ ఖాన్ వికెట్ దక్కించుకుని తన కెరీర్ తొలి టెస్టు వికెట్ దక్కించుకున్నాడు.

అప్పటి నుంచి చేతన్ శర్మ భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 1986లో ఇంగ్లాండ్ పై 2-0లో భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర అంతర్జాతీయ క్రికెట్‌లో23 టెస్టు మ్యాచులు ఆడిన శర్మ 61 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 1983 డిసెంబర్ లో అడుగుపెట్టాడు అప్పటి నుంచి 11 ఏళ్ల టీమిండియాకు సేవలందించాడు. చేతన్ శర్మ మొదటి వన్డేను వెస్టిండీస్ మ్యాచులతో ఆరంగేట్రం చేశాడు. 65 వన్డేలు ఆడిన శర్మ 87 వికెట్లు దక్కించుకున్నాడు.

1987లో రిలైన్స్ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై చేతన్ శర్మ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆ మ్యాచ్ లో కెన్ రూథర్ ఫార్డ్ , స్మిత్ , ఈవెన్ చాట్ ఫిల్డ్ వికెట్లు దక్కించుకుని హాట్రిక్ నెలకొల్పిన తొలి బౌలర్ గా రికార్డు సృషించాడు. మిడిల్ స్టంప్ ఆఖర్లో లెగ్ స్టంప్‌ను టార్గెట్‌ చేసుకుని బౌల్డ్ అతని బౌలింగ్ నిదర్శనం. 1989లో నెహ్రూ కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ దిగిన చేతన్ శర్మ (101) సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు.

ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ చెతన్ శర్మ చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. 1986లో ఆసియా కప్ ఫైనల్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం చేతన్ శర్మ బౌలింగ్ కారణమని ఇప్పటికీ విమర్శస్తుంటారు. ఉత్కంఠ భరిత పోరులో కీలక దశలో పాకిస్థాన్ విజయానికి ఒక బంతికి నాలుగు పరుగులు అవసరముండగా ఫుల్‌టాస్ రూపంలో బంతిని సందించాడు. చైతన్ శర్మ విసిరిన ఫుల్ టాస్ బంతిని జావెద్ మియాందాద్ సిక్స్‌గా మలిచేశాడు.

దీంతో పాకిస్థాన్ విజయం సాధించింది. న్యూజిలాండ్ పై జరిగిన ఓ మ్యాచ్ లో ఒకే ఓవర్లో 23 పరుగులు సమర్పించాడు. దీంతో అతని బౌలింగ్ గాడి తప్పిందని గ్రహించాడు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వెస్టిండీస్ జట్టుపై తన క్రికెట్ ప్రపంచలోకి ఆరంగేట్రం చేశాడో అదే జట్టుపై తన చివరి మ్యాచ్ ఆడి రిటైర్ మెంట్ ప్రకటించాడు. దీంతో చెతన్ శర్మ 11 ఏళ్ల కెరీర్ ముగిసింది. భారత్ క్రికెట్ జట్టుకు అతను అందించిన సేవలు ఎప్పటికి మవలేనివి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories