Top
logo

భారత్ క్రికెటర్ల సంఘం ఏర్పాటు

భారత్ క్రికెటర్ల సంఘం ఏర్పాటు
Highlights

భారత క్రికెటర్ల కోసం ప్రత్యేక సంఘం ఏర్పాటు చేశారు. బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం ఈ ఏర్పాటు జరిగింది. ప్రపంచ...

భారత క్రికెటర్ల కోసం ప్రత్యేక సంఘం ఏర్పాటు చేశారు. బీసీసీఐ కొత్త నియమావళి ప్రకారం ఈ ఏర్పాటు జరిగింది. ప్రపంచ దేశాలలో క్రికెట్ ఆదేదేశాలకు ఇటువంటి సంఘాలు ఉన్నాయి. మన దేశంలోనే ఇంతవరకూ ఈ ఏర్పాటు లేదు. 'కంపెనీల చట్టం 2013లోని సెక్షన్‌ 8 ప్రకారం భారత మాజీ క్రికెటర్ల కోసం ఏర్పాటైన ఇండియన్‌ క్రికెటర్ల అసోసియేషన్‌ను బీసీసీఐ అధికారికంగా గుర్తిస్తోంది. ఇది మినహా మరే సంఘానికి కూడా బోర్డు గుర్తింపు ఉండదు' అని బీసీసీఐ ప్రకటించింది. ఈ సంఘానికి బోర్డు ఆరంభంలో కొంత మొత్తం నిధులు అందజేస్తుందని... అయితే ఆ తర్వాత మాత్రం సొంత ఆదాయమార్గాలు చూసుకోవాలని కూడా బోర్డు సూచించింది. ఐసీఏకు ఎన్నికలు నిర్వహించే వరకు కపిల్‌ దేవ్, అజిత్‌ అగార్కర్, శాంత రంగస్వామి డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు.

అయితే, ఈ సంఘంలో మాజీ క్రికెటర్లు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం టీం ఇండియా కు ఆడుతున్న వారు ఈ సంఘంలో సభ్యత్వానికి అనర్హులు. ఇతర దేశాల్లో ఈ నిబంధన లేదు.


లైవ్ టీవి


Share it
Top