'ఎన్ని సెంచరీలు కొడతావు? నీకు బోరు కొట్టదా?'

ఎన్ని సెంచరీలు కొడతావు? నీకు బోరు కొట్టదా?
x
Highlights

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న...

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినా.. నిలకడగా ఆడుతూ భారీ స్కోర్ దిశగా వెళుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 77 పరుగులు చేయగా, నాటౌట్ గా నిలిచిన చతేశ్వర్ పుజారా 193 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.

199 బంతుల్లోనే పుజారా సెంచరీ చేశాడు. పుజారాకు ఈ సిరీస్‌లో ఇది మూడో సెంచరీ. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 123 పరుగులు చేసిన పుజారా భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో టెస్టులో కూడా భారీ స్కోర్ చేస్తున్న పూజారాను ఉద్దేశించి ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో నిల్చున్న పుజారాతో 'ఎన్ని సెంచరీలు కొడతావు? నీకు బోరు కొట్టదా?' అని నవ్వుతూ అన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 126 ఓవర్లకి 412 పరుగులు ఐదు వికెట్ల నష్టానికి.

Show Full Article
Print Article
Next Story
More Stories