శివరాత్రికి జాగరణ మంచిదే..ఎందుకో తెలుసా ?

శివరాత్రికి జాగరణ మంచిదే..ఎందుకో తెలుసా ?
x
Highlights

హిందువుల ఆరాధ్య దైవం శివుడు.. అసలు శివ అంటే ఏంటో తెలుసా.. శ్రేయస్సు, మంగళం, శుభం ఇలా చాలా అర్దాలున్నాయి.

హిందువుల ఆరాధ్య దైవం శివుడు.. అసలు శివ అంటే ఏంటో తెలుసా.. శ్రేయస్సు, మంగళం, శుభం ఇలా చాలా అర్దాలున్నాయి. ఇవన్నీ మనకు ప్రసాదించే భగవంతుడిని మనం పిలుచుకునే మరొక పేరు శివుడు.. మహా శివరాత్రి హిందువుల ముఖ్యమైన పర్వదినం. శివారాత్రి అనేది ప్రతినెలా మనం మాస శివరాత్రిగా జరుపుకున్నప్పటికి, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లేదా వేసవి వచ్చే ముందు నెలలో 13వ లేదా 14వ రోజు అంటే అమావాస్యకి ముందు రోజున వచ్చే మాఘ శుద్ధ చతుర్దశిని మహా శివరాత్రిగా జరుపుకుంటారు.

మహా శివరాత్రకి సంబంధించి పురాణాల్లో చాలా గాధలున్నప్పటికీ శాస్త్రీయంగా శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజున భూమి ఉత్త గోళం వైపు భూమియొక్క అంతర శక్తి పైకి పనిచేస్తుంది దీనివల్ల ఆ ప్రదేశం లో నివసించే జీవులపై ఆ శక్తి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వెన్నెముక కలిగి ఉండే జీవులు ఈ ఊర్ధ్వ శక్తిని అనుభూతి చెందుతారు.. అంతే కాదు మానవ పరిణామ క్రమంలో ఎప్పుడైతే మానవుల వెన్నెముక నిటారుగా అయిందో దాని తర్వాతే మానవుల ఆలోచన శక్తి పెరిగింది. అయితే శివరాత్రి రోజున భూమి ఊర్ధ్వ శక్తి పనిచేయడం నిద్రపోకుండా కూర్చో ని కానీ నిలబడి కానీ ఉండటం వలన అనారోగ్య సమస్యలు తగ్గుతాయని చెపుతుంటారు. అందుకే చాలామంది శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories