World Zoonoses day 2020: జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వ్యాధులు..వాటిపై అవగాహన కోసం జూనోసిస్ డే!

World Zoonoses day 2020:  జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వ్యాధులు..వాటిపై అవగాహన కోసం జూనోసిస్ డే!
x
Highlights

World Zoonoses Day: ప్రతి ఏడాది జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.జునోసిస్ అంటే ఏమిటి? ఆ వ్యాధులేమిటి? వివరాలు..

World Zoonoses Day: ప్రతి ఏడాది జూలై 6వ తేదీన ప్రపంచ జూనోసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిజానికి జూనోటిక్ వ్యాధుల గురించి, వాటిని ఏవిధంగా నివారించాలి అన్న అంశాలపైన అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ దినోత్స‌వ ముఖ్యోద్దేశం. అసలు జూనోసిస్ అంటే జంతువుల నుండి ప్ర‌జ‌ల‌కు వ్యాపించే అంటువ్యాధులు అని అర్ధం. ప‌శువైద్యుల నిర్వ‌చ‌నం ప్ర‌కారం గీకు ప‌ద‌మైన 'జూనోసెస్ 'అంటే 'జూన్' అంటే జంతువు, 'నోసోస్' అంటే అనారోగ్యం అని అర్థం వస్తుంది. అయితే జంతువుల నుంచి సుమారుగా 150 జూనోటిక్ వ్యాధులు ఉన్నట్లు పరిశోధకుల పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే జూలై 6 జూనోటిక్ వ్యాధికి వ్య‌తిరేకంగా మొద‌టి టీకాల‌ను వేసిన శాస్త్రీయ విజ‌యాన్ని తెలియ‌జేస్తోంది.

ఇక ఇదే రోజున లూయిస్ పాశ్చ‌ర్ అనే ఫ్రెంచ్ జీవ శాస్త్ర‌వేత్త కుక్క‌ల నుంచి రాబిస్ వ్యాధి వ‌స్తుంద‌ని గుర్తించ‌డ‌ం మాత్రమే కాకుండా ఆ వ్యాధిని అరికట్టడానికి టీకా మందును కూడా క‌నుగొన్నారు. ఈ రోజున ఆయ‌న సాధించిన ఈ విజ‌యానికి గుర్తుగా జూలై 6న ప్ర‌పంచ జూనోసిస్ డేని జ‌రుపుకుంటున్నారు. పాశ్చ‌ర్ మైక్రోబ‌యాల‌జిస్ట్, ర‌సాయ‌న శాస్త్ర‌వేత్త‌. ఈ టీకాతో పాటు ఆయన ఆంత్రాక్స్ వ్యాధికి కూడా టీకాల‌ను క‌నుగొన్నాడు. అంతే కాక సూక్ష్మజీవుల కిణ్వ‌న‌ప్ర‌క్రియ, పాశ్చ‌రైజేష‌న్ వంటి వాటిని కూడా క‌నుగొన్నాడు. పౌల్ట్రీ, ఎలుక‌లు, సరీసృపాలు, ఉభయచరాలు, కీటకాలు మరియు ఇతర దేశీయ లేదా అడవి జంతువుల కార‌ణంగానో ప్రజలు జూనోటిక్ వ్యాధుల బారిన ప‌డతారు. ఈ వ్యాధులు దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతాయి.

వివిధ రకాల వైరస్‌ల వల్ల సంక్రమిస్తోన్న వ్యాధులను ఆంగ్లంలో 'జూనాటిక్‌డిసీసెస్‌' లేదా 'జూనోసెస్‌' అని అంటారు. వన్యప్రాణులు, జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులని అర్థం. అయితే ఈ వన్యప్రాణుల ద్వారా సంక్రమించే వైరస్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి వరకు మానవులకు సంక్రమించే వ్యాధుల్లో 75 శాతం అంటువ్యాధులు కాగా, వాటిలో 60 శాతం జంతువుల నుంచి సంక్రమిస్తున్నవే. మెర్స్‌(మిడిల్‌ఈస్ట్‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌), ఒంటెల వల్ల వచ్చింది. సార్స్‌(సీవియర్‌అక్యూట్‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌) పునుగు పిల్లుల నుంచి మానవులకి వచ్చింది. ఎబోలా, బర్డ్‌ఫ్లూలు కోళ్ల వల్ల మానవులకి సంక్రమించాయి. ఈ వైరస్ లకు సాధారణంగా చికిత్స కంటే వ్యాధిని సులభంగా నివారించడమే మార్గం. ఈ రోజుల్లో, మెడికల్ సైన్స్, టీకాలతో కాకుండా వైరస్ లను ముందస్తు చర్యల ద్వారా సమర్థవంతమైన నివారణ చేపట్టవచ్చు.

జూనోటిక్ వ్యాధులను ఎలా నివారించాలి?

సబ్బు, శుభ్రమైన నీటితో చేతులు కడుక్కోవడం ద్వారా వైరస్ ని నివారించవచ్చు.

దోమలు, ఈగలు, ఇతర కీటకాలు రాకుండా పరిసరాల శుభ్రత, వ్యక్తగత శుభ్రత పాటించడం.

సరైన సమయానికి, సరైన ఆహారం తీసుకోవడం.

వైరాలజీ

5560 / పుమల వైరస్, ప్రతిరోధకాలు

5099 / టిక్-బర్న్ ఎన్సెఫాలిటిస్ వైరస్, యాంటీబాడీస్

5635 / డెంగ్యూ వైరస్, యాంటిజెన్ మరియు యాంటీబాడీ డిటెక్షన్

సూక్ష్మక్రిముల

5180 / సాల్మొనెల్లా,

5960 / బొర్రేలియా బర్గ్‌డోర్ఫేరి, ప్రతిరోధకాలు

5191 / మల బాక్టీరియల్ వ్యాధికారక, న్యూక్లియిక్ యాసిడ్ డిటెక్షన్

పారాసిటోలాజీ

5430 / మలేరియా, యాంటిజెన్ డిటెక్షన్

5420 / టోక్సోప్లాస్మా, ప్రతిరోధకాలు

5450 / మలంలో పరాన్నజీవులు, వర్చువల్ మైక్రోస్కోపీ

రక్తంలో 5470, 5471 / పరాన్నజీవులు, వర్చువల్ మైక్రోస్కోపీ

5472 / గియార్డియా మరియు క్రిప్టోస్పోరిడియం, న్యూక్లియిక్ యాసిడ్ డిటెక్షన్

అత్యంత సాధారణ జూనోటిక్ వ్యాధులు:

ప్లేగు

క్షయ

పిల్లి స్క్రాచ్ ఫీవర్

టిక్ పక్షవాతం

హంటవైరస్

రింగ్వార్మ్

లెప్టోస్పిరోసిస్

లైమ్ వ్యాధి

క్యాంపిలోబాక్టర్ సంక్రమణ

గియార్డియా ఇన్ఫెక్షన్

క్రిప్టోస్పోరిడియం సంక్రమణ

హుక్ వార్మ్స్

గజ్జి

హార్వెస్ట్ పురుగులు

రాబీస్

Show Full Article
Print Article
Next Story
More Stories