నేడు ప్రపంచ జల దినోత్సవం...

నేడు ప్రపంచ జల దినోత్సవం...
x
World Water Day 22 March
Highlights

భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు.

భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము. నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము.

ప్రప్రథమ జీవి పుట్టుక నీటితోనె జరిగింది. భూతలం నాల్గింట మూడు వంతులు మహాసముద్రాలు, నదులు, తటాకాలు వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు. ప్రతి ఏడాది మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఐక్యరాజ్యసమితి తీర్మానించినది .ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, " పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియో డి జెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ '' (యు ఎన్ సి ఇ డి) లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా, 2010 సంవత్సరాన్ని " ఆరోగ్యవంతమైన ప్రపంచంకోసం, పరిశుభ్రమైన నీరు " అనే, నిర్దిష్ట భావనతో పాటిస్తున్నారు.

నీళ్లు-నిజాలు

వేసవి వస్తోందంటేనే భయమేస్తోంది. నీటి కొరత దడ పుట్టిస్తుంది. కనీసం తాగు నీరు దొరకక ఎంతో మంది బిందెలతో బారులు తీరి వీధుల్లో కనిపిస్తారు. ఇప్పటికి ఇలా నీరు లభించకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. గొంతు తడుపుకునే చుక్క నీటికోసం మైళ్లకు మైళ్లు నడిచిపోవాల్సిన పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారు. మంచి నీల్లు దొరకక కుంటల్లో, గుంటల్లో అడుగుబొడుగు మురికి నీటినే తాగాల్సిన దుస్థితిలో ఎంతో మంది ఉన్నారు. నీటి ఎద్దడిని ప్రపంచంలో 80 దేశాలు ఎదుర్కొంటున్నాయి.

నీరు లేని భూమిని ఒకసారి ఊహించుకోండి. పచ్చని చెట్లు, పారే నదులు, జీవులు, మహా సముద్రాలు ఏమీ ఉండవు. ఐక్య రాజ్య సమితి 1993 నుంచి ప్రతి ఏడాది మార్చి 22ను అంతర్జాతీయ జలదినోత్సవంగా గుర్తించాలని నిర్ణయించింది. ఎందుకంటే అమూల్యమైన నీటి విలువను తెలుసుకోడానికి, దానిని వృథా చేయకుండా అవగాహన కల్పించడానికి ఈ రోజును నిర్ణయించారు. రోగాల నివారణలో దివ్య ఔషధం నీరు నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడుతుంది. ఈ రెండు వాయు పదార్ధాలతో నీరు తయారవుతుంది. దీంతో నీటిని తాగడం వలన అనేక వ్యాధులను కూడా నయం చేయవచ్చును.

నీటి చక్రం

నీరు ఈ భూమండలంపై 71 శాతానికి పైగా ఆవరించి ఉంది. ఈ భూమి పై నీరు మూడు రూపాలలో ఉంది. 1. ఘన రూపం అంటే మంచు గడ్డల రూపంలోను, 2. ద్రవ రూపం, సముద్రాలు, నదులు, తటకములు మొదలగునవి, 3.వాయు రూపంలో ఉంటుంది. ఈ నీటి చక్రం అంటే నీరు ద్రవరూపంనుండి వాయు రూపంలోకి, అక్కడి నుండి తిరిగి ద్రవ రూపంలోనికి నిరంతరం మారుతూ వుంటుంది.

నీటి స్థితులు

భూమిపై నీరు మూడు స్థితులలో కనిపిస్తుంది. నీరు సూర్యుని వేడిమికి ఆవిరి రూపం ధరించి, (వాయు రూపం) మేఘాలుగా మారి చల్లదనానిని ద్రవ రూపంలోనికి మారి ఆకాశం నుండి వర్ష రూపంలో తిరిగి భూమికి చేరుతుంది. ఆ ప్రక్రియలో ప్రకృతిలోని సమస్త జీవరాసులకు నీటిని అందించి భూగర్బజలం, నదులు, జలాశయాలు ఇలా ప్రవహించి తిరిగి సముద్రములో కలుస్తుంది. ఈ ప్రక్తియ నిరంతరము కొనసాగు తుంది.

జలకలుషితం

నాగరికథ అభివృద్ధి చెందుతున్న క్రమంలో క్రొత్త క్రొత్త సమ్మేళన పదార్థములతోను, విష పూరిత రసాయన పదార్థాల తోను నీరు కలుషిత మౌతున్నది. అలా కలుషితమైన జలము జల చక్రముద్వారా తిరిగి ఆవిరి రూపం ధరిస్తుంది. ఈ క్రమంలో ఆ జలం తనలోని ఇతర కలుషిత పదార్థములను, అనగా రసాయన పదార్థములను కూడా కలుపుకొని వాయురూపంలో మేఘాలుగా మారి అక్కడి వాతావరణం అనుకూలించగానే ద్రవించి తిరిగి వర్షరూపంలో తిరిగి భూమిని చేరుతున్నది. ఆకలుషిత మేఘాలు వర్షించినపుడు రంగు రంగులలో వర్షము కురవడము, ఆమ్ల వర్షాలు కురవడము సర్వ సాధారణము. దాంతో ప్రకృతికి అపార నష్టము జగురుతున్నది.

జీవ శాస్త్రం

జీవం నీటి నుంచి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రియలన్నీ నీటి వల్లనే సంభవం. జంతువుల శరీరంలో 70-90 శాతం నీరు ఉంటుంది. నీరు ముఖ్యంగా రెండు రకాలు. అవి సముద్రపు నీరు, మంచి నీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. జంతువులు నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి. జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి, ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త దావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవపదార్ధాల రవాణాకు తోడ్పడుతుంది.

తాగునీటిని వృథా చేస్తే జైలు

ముంబయిలో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే జైలు శిక్ష అనుభవించడం, జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో మొక్కలకు నీరు పట్టడం, భవన నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories