వొడాఫోన్‌వినియోగదారులకు శుభవార్త : ఈ ప్లాన్‌పై డబుల్ డేటా

వొడాఫోన్‌వినియోగదారులకు శుభవార్త : ఈ ప్లాన్‌పై డబుల్ డేటా
x
Highlights

మొబైల్ డాటా ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులకు వోడాఫోన్ శుభవార్త తెలిపింది.

మొబైల్ డాటా ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులకు వోడాఫోన్ శుభవార్త తెలిపింది.గతంలో ఇచ్చిన డేటా కన్నా రెట్టింపు డేటాను అందిస్తోంది. ఇందులో భాగంగానే కస్టమర్లను మరింత ఆకర్షించడానికి రూ.98 ప్లాన్‌పై బెనిఫిట్స్‌ని పెంచింది. ఇంతకు ముందు వోడాఫోన్ రీచార్జ్ రూ.98తో చేసుకుంటే వారికి 28 రోజుల వేలిడిటీతో 6జీబీ డేటా అందించేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కస్టమర్లకు అదనపు లాభాలను అందించేందుకు గాను రూ.98 రీఛార్జ్ చేసేవారికి ఇకపై 12జీబీ డేటా అందిస్తుంది. ఇది యాడ్ ఆన్ ప్యాక్. అంటే రూ.98 రీఛార్జ్ చేసుకుంటే 12జీబీ 4జీ డేటా మాత్రమే వస్తుంది. ఈ ప్యాక్ లో కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు. అయితే ఈ ప్లాన్ ను ఎక్కువ డేటా వాడేవారికి మాత్రమే ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌తో పాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా సర్కిళ్లలో కూడా లభిస్తుంది. అంతే కాదు జీ5 లేదా వొడాఫోన్ ప్లే లాంటి కాంప్లిమెంటరీ కంటెంట్ బెనిఫిట్స్ కూడా ఉండవు.

ఈ మధ్య కాలంలో ఎయిర్‌టెల్ సంస్థ కూడా రూ.98 ప్లాన్‌పై డబుల్ డేటా ప్రకటించడంతో వొడాఫోన్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ రూ.251 రీఛార్జ్ చేసిన వారికి 50 జీబీ డేటాను అందిస్తుంది. వీటితో పాటు రిలయెన్స్ జియో కూడా రూ.251 ప్లాన్‌పై 50 జీబీ డేటా, రూ.151 ప్లాన్‌పై 30జీబీ, రూ.201 ప్లాన్‌పై 40జీబీ, 30 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories