ఎన్నిటినో తట్టుకున్న జాతి మాది.. 'కరోనా ఓ లెక్కా' అంటూ పేరడీ లు పేలుస్తున్న నెటిజన్లు!

ఎన్నిటినో తట్టుకున్న జాతి మాది.. కరోనా ఓ లెక్కా అంటూ పేరడీ లు పేలుస్తున్న నెటిజన్లు!
x
corona jokes representational images
Highlights

కరోనా వైరస్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు.. ఇప్పటివరకూ మానవాళి ఎన్నో రకాల వైరస్ ను ఎదురుకుని నిలిచింది. సమాచార వ్యవస్థ అంత ప్రభావం చూపించని...

కరోనా వైరస్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు.. ఇప్పటివరకూ మానవాళి ఎన్నో రకాల వైరస్ ను ఎదురుకుని నిలిచింది. సమాచార వ్యవస్థ అంత ప్రభావం చూపించని కాలంలో ఆ వ్యాధుల పట్ల మన జనం రియాక్షన్ ఎలా ఉందొ తెలీదు కానీ, ఇప్పుడు కరోనా పై మాత్రం జోకులు పేలుస్తూ నేట్టింట్లో హడావుడి చేసేస్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలీకపోయినా, సమాచార మాధ్యమాల ద్వారా ఇతర దేశాలలో పరిస్థ్తిని గమనిస్తున్న ప్రజలు మన దేశంలో మాత్రం ఆందోళనను కనిపించనీయకుండా సరదాగానే కరోనా ను ఎదుర్కోవడానికి ఆత్మవిత్వాశంతో సిద్ధం అయిపోతున్నారు.

సోషల్ మీడియాలో రకరకాల కథలు రాయడంలో మన నెటిజన్లను మించిన వారు లేరు. ఆవకాయ నుంచి అన్వాయుధాల దాకా ఏ విషయాన్నైనా సరదాగా చెప్పడంలో మనవాళ్ళు సిద్ధహస్తులు. ఇప్పుడు కల్లోలం రేకెత్తిస్తున్న కరోనా పై కూడా అలాంటి సరదా వ్యఖ్యానాలు కథనాలతో అన్దరినిఏ ఆహ్లాదంగా ఉపద్రవాన్ని ఎదుర్కునేందుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధ పడేలా చేస్తున్నారు.

ఇటీవల ఒక జోక్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక బిచ్చ గాడు శానిటైజర్ తన పక్కన పెట్టుకుని.. ''నాకు దానం చేయాలనుకునే వారు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుని దానం చేయాలని మనవి'' అనే బోర్డు తగిలించుకుంటాడు. చేతుల పరిశుభ్రత గురించి సరదాగా చెప్పి మెప్పించిన జోక్ ఇది. ఇక ఇదిలా ఉండగా మరో వింతైన వ్యాఖ్యానం ఒకటి ఇప్పుడు నేట్టింట్లో హల్చల్ చేస్తోందిల్.దానవీర శూరకర్ణ సినిమాలో కర్ణుడి గురించి దుర్యోధనుడు చెప్పిన డైలాగుకు పేరడీగా ఈ డైలాగ్ రాశారు. ఇందులో మానవ జాతి ఇంతవరకూ ఎదుర్కున్న ఎన్నో మహామ్మరులను వరుసగా తెలుపుతూ.. వీటన్నిటినీ ఎదుర్కున్న మేము ఇంకా నిలిచే ఉన్నాం.. కరోనా వస్తే మాత్రం భయపడతామా అంటూ ఆత్మవిశ్వాసంతో అందర్నీ ఉత్తేజ పరిచేతట్టుగా ఉంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యంలో ఉంది. దీని ఒరిజినల్ ఎవరు రాశారో తెలీదు కానీ, మంచి ఆత్మవిత్వాశాన్ని ప్రచారం చేస్తున్న ఈ డైలాగ్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాం మీరూ ఓ లుక్కేయండి!

ఆగాగు..

క‌రోనాచార్యదేవా!

అహ్హ‌హ్హా.. ఏమంటివి? ఏమంటివి ? వైర‌స్‌ నెపమున మ‌నిషి మ‌నుగ‌డ‌కింత నిలువ‌నీడ లేదందువా?

ఎంత మాట? ఎంత మాట?

ఇది ఉత్త ప‌రీక్ష‌యేగానీ ఉప‌యోగ‌ప‌డే పరీక్ష కాదే ?

కాదు.. కాకూడదు. ఇది మ‌ర‌ణ‌ ప‌రీక్ష అందువా?

ఎబోలా వైర‌స్ జ‌న‌న‌మెట్టిది? అతి జుగుప్సాకరమైన నిఫా వైర‌స్ సంభ‌వ‌మెట్టిది? మట్టిలో క‌లిసెను క‌దా?

అహ్హ‌హ్హా.. అదికాదా నీ నీతి?

ఇంతయేల.. ప్ర‌పంచ‌మంతా వ్యాపించి.. వ‌ణికించి.. క‌బ‌ళించి.. క‌కావిక‌లం చేస్తున్న మ‌హ‌మ్మారిల‌ను మేం త‌రిమేయ‌లేదా? వాటిదే ప‌రీక్ష‌?

మాన‌వాళి భ‌విష్య‌త్‌ను అంధ‌కారం చేసి.. స‌క‌ల ఖండాల‌ను చుట్ట‌బెట్టి.. కోట్లాది ప్రాణాల‌ను హ‌రించి మేం పున‌ర్ జ‌నించ‌లేదా? వాటిదే ప‌రీక్ష‌?

నాతో చెప్పింతువేమయ్యా..

మా వంశమునకు మూలపురుషులైన ఆదిమాన‌వులు మ‌హ‌మ్మారిని త‌ట్టుకోలేదా?

అంత‌కంత‌కూ వ్యాపిస్తూ ఆందోళ‌న క‌లిగించిన అంటువ్యాధిని.. ఆ వ్యాధిని అంటిపెట్టుకొని తిరిగిన క‌ల‌రాను..

దానిని దాటేసుకుంటూ వ‌చ్చిన మ‌శూచిని.. ఆ వ్యాధికి తోడుగా వ‌చ్చిన ప్లేగును.. ఆ త‌ర్వాత వ‌చ్చిన హెచ్ఐవీని..

దానికంటే డేంజ‌రైన క్యాన్స‌ర్‌ను..ఆ పిద‌ప వ‌చ్చిన సార్స్‌ను.. అంత‌టితో ఆగ‌కుండా దూసుకొచ్చిన స్వైన్‌ఫ్లూను..

ఆవుల నుంచి వ‌చ్చిన క్ష‌య‌ను.. బాతుల నుంచి వ‌చ్చిన ఫ్లూను.. మా ఇండ్ల‌లో అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి పిల‌గాండ్ల‌ను ప‌ల‌క‌రించే ఆట‌ల‌మ్మ‌ను..

అంత‌కంత‌కూ త‌ట్ట‌కుని బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేదా?

సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన ఈ వైర‌స్ వంశ‌ము ఏ నాడో మా చేతుల కుక్క చావు చ‌చ్చిన‌ది.

కాగా నేడు క‌రోనా.. క‌రోనా అను వ్య‌ర్థ వాద‌ములెందుకు.. ??

కరోనా వైరస్ ను మానవజాతి దీటుగా ఎదుర్కోగాలడనే సందేశం ఇవ్వడం కోసం మాత్రమె దీనిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ఒరిజినల్ రచయిత ఎవరో తెలియదు కానీ, ప్రస్తుతం వాట్సప్, ఇంస్తాగ్రాం వంటి సోషల్ మీడియాల్లో ఇది విపరీతంగా చక్కర్లు కొడుతోంది!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories