ఇన్‌స్టాగ్రామ్ లో బగ్ కనిపెట్టాడు.. 20 లక్షలు పట్టాడు!

ఇన్‌స్టాగ్రామ్ లో బగ్ కనిపెట్టాడు.. 20 లక్షలు పట్టాడు!
x
Highlights

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుల సమ్మతి లేకుండానే వారి అకౌంట్ ను హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని నిరూపించిన ఓ తమిళ కోర్రోడికి 30 వేల డాలర్లు(రూ. 20,65,815.00)...

ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుల సమ్మతి లేకుండానే వారి అకౌంట్ ను హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని నిరూపించిన ఓ తమిళ కోర్రోడికి 30 వేల డాలర్లు(రూ. 20,65,815.00) బహుమతి లభించింది. ఫేస్‌బుక్ సంస్థ తీసుకొచ్చిన బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌లో తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ ముత్తయ్య అనే కుర్రాడు ఈ నగదు గెల్చుకున్నాడు.

ఈ ప్రోగ్రామ్ ద్వారా లక్ష్మణ్.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారుల సమ్మతి లేకుండానే వారి అకౌంట్‌ను హ్యాక్ చేయవచ్చని, ఈ బగ్‌ను ఇన్‌స్ట్రాగ్రామ్‌ టీం కూడా గుర్తించలేదని లక్ష్మణ్ తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని లక్ష్మణ్ ఫేస్‌బుక్ సెక్యూరిటీ టీం దృష్టికి తీసుకెళ్లాడు. ఈ-మెయిల్స్, కాన్సెప్ట్ వీడియో ద్వారా ఈ హ్యాకింగ్ ఎలా చేయచ్చో వివరించాడు. దీంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సెక్యూరిటీ టీం వెంటనే అప్రమత్తమై సమస్యను పరిష్కరించారు. బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కింద బగ్‌ను కనుగొన్న లక్ష్మణ్‌కు ఇన్‌స్టాగ్రామ్ సంస్థ రూ. 20 లక్షల నగదును ఇచ్చింది. కాగా, లక్ష్మణ్ ఇంతకుముందు కూడా ఫేస్‌బుక్‌లో ఉన్న కొన్ని బగ్స్‌ను కనుగొని, సెక్యూరిటీ టీం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి సహాయపడ్డాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories