'రామన్ ఎఫెక్ట్' తో విజ్ఞాన రంగంలో చిరస్మరణీయుడైన సర్ సీవీ రామన్!

రామన్ ఎఫెక్ట్ తో విజ్ఞాన రంగంలో చిరస్మరణీయుడైన సర్ సీవీ రామన్!
x
Sir CV Raman
Highlights

ఒక అవమానం నుంచి పుట్టిన పట్టుదల సామాన్యుడిని అసామాన్యుడిని చేసింది. ఆ పట్టుదల తోనే నోబెల్ బహుమతి గెలిచారు సీవీ రామన్.

ఒక అవమానం నుంచి పుట్టిన పట్టుదల సామాన్యుడిని అసామాన్యుడిని చేసింది. పది మంది మధ్య తన మాటలపై వచ్చిన వ్యంగ్య బాణాలలోని వ్యంగ్యాన్ని చూడకుండా ఆ మాటల్లోంచి తన దృక్పధాన్ని మార్చుకున్నారు. ఆ దృక్పథంతోనే నోబెల్ బహుమతి గెలిచి లోకం మెచ్చిన శాస్త్రవేత్త అయ్యారు. ఆయన కనిపెట్టిన సిద్ధాంతం తరువాతి తరాల పరిశోధనలకు మూలాలంబనగా నిలిచింది. రామన్ ఎఫెక్ట్ అంటూ ఆయన పేరుతోనే పరిశోధకులకు ఉన్నత బాటలు చూపించింది. సర్ సీవీ రామన్.. భారత దేశపు గర్వకారణం. ఆ మహనీయుని పుట్టినరోజు ఈరోజు (నవంబర్ 7) అయన గురించి కొన్ని విశేషాలు.. కచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సినవి..

సీవీ రామన్ గా ప్రసిద్ధి చెందిన ఆయన అపూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. తిరుచినాపల్లి సమీపంలో అయ్యన్ పెటాయ్ గ్రామంలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతుల బిడ్డడు అయన.

విశాఖపట్నంలో విద్య..

రామన్ విశాఖపట్నం లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. భౌతిక శాస్త్రం అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఆయన తన 12 వ ఏటనే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అంత చిన్న వయసులోనే మెట్రిక్ పూర్తీ చేయడం ఒక విశేషమైతే భౌతిక శాస్త్రం (పిజిక్స్) లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించారు. తరువాత ఎమెస్సీ ఫిజిక్స్ లో యునివర్సిటీ టాపర్ గా నిలిచారు. తన 18 వ ఏట కాంతికి సంబంధించిన ధర్మాలపై రామన్ రాసిన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. దీంతో ఆయనను లండన్ లో పరిశోధనలు చేయడానికి వెళ్లాలని ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. అయితే, అయన ఆరోగ్యం సముద్ర ప్రయాణానికి పని చేయదని వైద్యులు ఇంగ్లాండ్ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు.

1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయిన ఆయన ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచచించినా బ్రిటీష్‌ ప్రభుత్వంఅంగీకరించలేదు. దాంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించారు సీవీ రామన్.

పరిశోధనల బాటలో..

ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాళ్‌తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో బౌబజారు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి, ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్‌ను కలిసి పరిశోధన చేయడానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున ఐదున్నరకే ఐసిఎస్‌కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన, ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి.

శబ్దం నుంచి కాంతి వైపు..

మొదట్లో రామన్ పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీతవాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1921లో లండన్‌లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. అవి విన్న ఒకాయన్ ఇలాంటి అంశాలతోరాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటు రామన్ ను వెతకరించారు. దీంతో రామన్ కు మరింత పట్టుదల పెరిగింది. అక్కడ నుంచి తన పరిశోధనలను శబ్దశాస్త్రం నుంచి కాంతి శాస్త్రం వైపు మార్చుకున్నారు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపచేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలి రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణం అని ఊహించాడు. అదే అయన పరిశోధనల్ని మేలిమలుపు తిప్పింది. ఆయనకు పరిశోధనల్లో యువశాస్త్రవేత్తలైన కె.ఆర్.రామనాధన్, కె.యస్ .కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. 1927 డిసెంబరులో ఒకరోజు సాయంత్రం కె.యస్.కృష్ణన్ రామన్ వద్దకు పరుగెత్తుకొని వచ్చి కాంప్టన్ (భౌతిక శాస్త్రవేత్త)కు నోబెల్ బహుమతి వచ్చిందని చెప్పారు. అప్పుడే అయన మదిలో కాంప్టన్ ఫలితం ఎక్సరేస్ విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని కష్టానికి ఎదురీది తన పరిశోధనలు కొనసాగించారు.

తిరుగులేని పరిశోధన..

అయన కష్టానికి 1928 ఫిబ్రవరి 28 న ఫలితం దక్కింది. ''పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపచేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది'' అని కనిపెట్ట గలిగారు. ఇదే విషయాన్ని అయన 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞులసదస్సులో నిరూపించారు. అంతే ఆ పరిశోధన రామన్ ఎఫెక్ట్ గా చరిత్రలో నిలిచిపోయింది.

అవార్డుల అంబరం..

అయన రామన్ ఎఫెక్ట్ ఆయనను అవార్డుల అంబరాన్ని ఎక్కించింది. బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. 1954లో 'భారతరత్న' అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది.

ఆయన స్ఫూర్తితో..

'విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వంతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి' అంటూ అయన భారత రత్న అవార్డు తీసుకున్న సమయంలో ఇచ్చిన ఉపన్యాసం స్ఫూర్తిగా నిలిచింది. అదేస్ఫూర్తితో ఆయన రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజైన ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తోంది భారత ప్రభుత్వం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories