తెలివిగల కుక్క.. చూసిన పబ్లిక్ ఫిదా

తెలివిగల కుక్క.. చూసిన పబ్లిక్ ఫిదా
x
Highlights

మనం రోడ్లపై తరుచూ చూస్తూనే ఉంటాం. చాలా మంది కాళ్లు, చేతులు లేనట్లు అడుక్కోవడం చూస్తుంటాం. వారిలో కొంతమందికి నిజంగానే కాళ్లు, చేతులు లేకపోవోచ్చు.. కానీ మరికొందరైతే.. కష్టపడకుండానే సుఖపడుదాం అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు.

మనం రోడ్లపై తరుచూ చూస్తూనే ఉంటాం. చాలా మంది కాళ్లు, చేతులు లేనట్లు అడుక్కోవడం చూస్తుంటాం. వారిలో కొంతమందికి నిజంగానే కాళ్లు, చేతులు లేకపోవోచ్చు.. కానీ మరికొందరైతే.. కష్టపడకుండానే సుఖపడుదాం అనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. కాళ్లు, చేతులు లేకుండా ఆడుక్కుంటూ ఉంటారు. వారిని చూసిన జనాలు అయ్యోం పాపం అని కరిగిపోయి డబ్బులు దానం చేస్తుండటం మనం చూస్తుంటాం కదా! ఇదిలా ఉంటే మనుషులతో పాటే జంతువులు కూడా ఇదే తరహా మోసం చేస్తే ఎలా ఉంటుంది? మాటలు రానీ మూగజీవులు ఎలా మోసం చేస్తాయి అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఎందుకుంటే ఈ ఫోటోలో కనిపిస్తున్న కుక్క చాలా తెలివికల్లది కనుక.

అలా ఎలా అనుకుంటున్నారా.. దాని కాలు విరగకపోయినా... విరిగిపోయినట్లుగా చాలా చక్కగా నటిస్తోంది మరి! ఇక ఆ కుక్కని చూసిన వారు అయ్యోం ఎంత కష్టం వచ్చింది.. అని బాధపడుతూ కుక్కకు సరిపడ ఆహరం పెడుతున్నారు. అలా ఆ కుక్క చాలా మందిని మోసం చేసుకుంటూ వోస్తోంది. ఈ ఘటన బ్యాంకాక్‌లో చోటుచేసుకుంది. అతి తెలివితేటలున్న కుక్కను బ్యాంకాక్ ప్రజలు గాయ్ అని పిలుస్తున్నారు. అయితే ట్వీస్ట్ ఏంటి అంటే.. అది మోసం చేస్తుందని తెలిసికూడా దాన్ని పిలుచి మరి ఆహారం పెడుతున్నారు ఎందుకంటే.. దాని తెల్వికి అక్కడి వారు ఫిదా అయిపోయారు కాబట్టి. అయితే ఈ కుక్కని చోంగ్పాపోల్కుల్ అనే వ్యక్తి పెంచుతున్నాడు. కానీ అది మాత్రం తీరోక్క రుచులకు అలావాటుపడిన ఆ కుక్క.. రోడ్లమీద వెళ్లేవారు దానిని చూసి ఆహారం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఓ వ్యక్తి ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారెవ్వా.. వాట్ ఏ ఇంటలిజెంట్ కుక్క అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories