

Penugonda: పెనుగొండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి జయకేతనం!
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి కుడిపూడి శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థిపై 1,672 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో విజయం ఖరారు కావడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.


Penugonda: వడలి గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి ఉప్పలపాటి మౌనిక గెలుపు!
పెనుగొండ మండలం వడలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఉప్పలపాటి మౌనిక నాగ సుప్రియ 177 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే మద్దతుదారులు సంబరాలు జరుపుకుని అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.


Penumantra: పొలమూరులో ప్రజాస్వామ్య విజయభేరి.. నాగలక్ష్మికి ప్రజల పట్టాభిషేకం!
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఐక్య ఫ్రంట్ అభ్యర్థి వేండ్ర నాగలక్ష్మి విజయం సాధించడంతో గ్రామంలో సంబరాలు మిన్నంటాయి. బాధ్యతలు చేపట్టిన 60 రోజుల్లో సమగ్ర సర్వే నిర్వహించి పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీరు, వీధిలైట్ల సమస్యలను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.


Kagi Mail: జీమెయిల్‌కు పోటీగా కాగి మెయిల్.. యాడ్స్, నిఘా లేకుండా ఈమెయిల్ సర్వీస్..!
Kagi Mail: ఆఫీస్ పనుల నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఆన్‌లైన్ ఖాతాల వరకు ఈమెయిల్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలామందికి జీమెయిలే మొదటి ఎంపికగా ఉంది. ఈ నేపథ్యంలో జీమెయిల్‌ను సవాల్ చేయడానికి కొత్త ఆప్షన్ ముందుకొచ్చింది.

Avatar: అవతార్ 4, 5 ఎప్పుడు వస్తున్నాయో తెలుసా? డిస్నీ చెప్పిన తేదీలివే..!
Avatar: అవతార్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కుతున్న సీక్వెల్స్ రిలీజ్ తేదీలను డిస్నీ సంస్థ ప్రకటించింది. 2029 డిసెంబర్ 21న అవతార్ 4ను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తామని తెలిపింది. 2031 డిసెంబర్ 19న అవతార్ 5 విడుదల కానుంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో డిస్నీ ఈ వివరాలను వెల్లడించింది.


Palwancha: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పాత పాల్వంచ 46వ డివిజన్‌లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవితో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను ప్రారంభించి, ప్రజలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Thimmapur: మండల టాపర్ మధుప్రియకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.10 వేల చెక్కు!
చదువుకో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ఎస్ఎస్‌సీ టాపర్‌గా నిలిచిన మల్లాపూర్ విద్యార్థిని బుర్ర మధుప్రియను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు సన్మానించారు. డీఓ పల్లె కుమారస్వామి తదితరులు రూ.10,000 ప్రోత్సాహక చెక్కును అందజేసి, ఉన్నత చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు.


Komuravelli: కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ ఆదాయం రూ.74.46 లక్షలు నమోదు!
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించగా, గత 71 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.74.46 లక్షల నగదు, 44 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరాయి. ఆలయ ఈఓ టి. శ్రీకాంత్ రావు, అధికారుల పర్యవేక్షణలో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు.


Mohammadabad: అంధకారంలో మొహమ్మదాబాద్ ఎస్సీ కాలనీ.. చీకట్లో మగ్గుతున్న ప్రజలు!
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ ఎస్సీ కాలనీలో ఉదయం నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాలనీ అంధకారంలో మగ్గుతోంది. వీధి లైట్లు వెలగక విష సర్పాలు, దోమల భయంతో పాటు బోరు మోటార్ పనిచేయక నీటి ఎద్దడితో అవస్థలు పడుతున్నామని, విద్యుత్ సిబ్బంది తక్షణమే స్పందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.


Peddapuram: ఆర్బీ కొత్తూరులో వైసీపీ ఘన విజయం.. సంబరాలు అంబరాన్నంటేలా
పెద్దాపురం మండలం ఆర్బీ కొత్తూరు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. మాజీ సర్పంచ్ గోలి రామారావు అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 12 వార్డులతో పాటు సర్పంచ్ స్థానాన్ని సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.


Peravali: పార్టీలు, వర్గాలకు అతీతంగా ఖండవల్లి సర్పంచి ఏకగ్రీవం!
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి సర్పంచ్‌గా కడలి ధనలక్ష్మి, 16 వార్డు సభ్యులు పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పారిశ్రామికవేత్త భూపతిరాజు శ్రీరామరాజు చొరవతో సర్పంచ్ అభ్యర్థి, శ్రీరామరాజు గ్రామాభివృద్ధికి చెరో రూ.51 లక్షలు ప్రకటించారు. బెల్ట్ షాపుల నిషేధం, సోలార్ దీపాల ఏర్పాటుతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దనున్నారు.


Nidadavole: ఉండ్రాజవరంలో జోరందుకున్న కూటమి సర్పంచి అభ్యర్థి ఎన్నికల ప్రచారం!
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో కూటమి బలపరిచిన బీసీ మహిళా సర్పంచ్ అభ్యర్థి సిరిసపల్లి రాజేశ్వరి తరఫున శుక్రవారం ఇంటింటా ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. మాజీ సర్పంచి గన్నమని వెంకటసుబ్బారావు ఆధ్వర్యంలో నేతలు పర్యటించి, రాజేశ్వరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.