"ఈ చిన్న పని, మీకు పెద్ద విజయం తీసుకువస్తుంది"

ఈ చిన్న పని, మీకు పెద్ద విజయం తీసుకువస్తుంది
x
Highlights

ఫ్రండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం…. "ఈ చిన్న పని, మీకు పెద్ద విజయం తీసుకువస్తుంది". వ్యక్తిత్వ వికాస పుస్తకాలల్లో కొన్ని పుస్తకాలూ ఎప్పటికి...

ఫ్రండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం…. "ఈ చిన్న పని, మీకు పెద్ద విజయం తీసుకువస్తుంది".

వ్యక్తిత్వ వికాస పుస్తకాలల్లో కొన్ని పుస్తకాలూ ఎప్పటికి ప్రత్యేకంగా, విజయవంతంగా నిలిచిపోతాయి, అలాంటిదే నెపోలియన్ హిల్ వ్రాసిన పుస్తకం "థింక్ అండ్ గ్ర్రో రిచ్". ఈ పుస్తకం లో రచయిత అంటారు. "మీరు ఎ పని చేయాడానికైన ముందు, అసలు ఆ పని ఎందుకు చేస్తున్నారు" అనేది తెలుసుకోవాలి అని అంటాడు. మనం చేసే ప్రతి పనికి "పర్పస్" లేదా కారణము తెలుసుకోవడానికి, మనం ముందుగా అసలు ఈ పని "ఎందుకు" అనే ప్రశ్న వేసుకోవాలి అని సలహా ఇస్తాడు. మనం ఒక పని ఎందుకు చేస్తున్నాము అనే ప్రశ్నకి వచ్చే సమాధానం తృప్తికరంగా వుంటే ...తప్పక ఆ పనిని మనం విజయవంతంగా చెయ్యగలమట.

ఫ్రెండ్స్! ఒక పని వెనక వున్నఖచ్చితమైన ప్రయోజనం సాదించడానికి, దాని గురించి కోరికను పెంచుకోడానికి ఒక ఆరు పద్దతులు ఈ పుస్తకంలో సూచిస్తాడు ఈ రచయిత. ఆ ఆరు స్టెప్ ఎలా మన విజయానికి ఉపయోగపడతాయో చెపుతాడు. అలాగే మీ ఖచ్చితమైన ప్రయోజనం మీకు స్పష్టంగా వున్నప్పుడు మీ మనస్సు దానిపైనే వుంటుంది అంటాడు మన థింక్ అండ్ గ్ర్రో రిచ్ రచయిత నెపోలియన్ హిల్. అయితే ఖచ్చితమైన ప్రయోజనం అంటే అది మీ కోరిక లేదా మీ లక్ష్యం అయినా ఏదైనా అయివుండవచ్చు. అవి మీ శరీర భరువు తగ్గడం అయిన, కండలు పెంచడం అయిన, డబ్బు సంపాదించిండం అయిన, ఉద్యోగం సంపాదించడం అయిన లేదా ఉద్యోగంలో ప్రమోషను, కొత్త కారు కొనటం, కొత్త ఇల్లు ఇలా ఏదైనా అయివుండవచ్చు.

కాబట్టి ఆ ఒక్కటి ఏంటో స్పష్టంగా వుండటం వలన, మీ ఫోకసు మొత్తం దానిపైనే పెట్టగలరు, అలా మీ టైం, ఎనర్జీ, ఆలోచనలు అన్ని మీ లక్ష్యానికి పెట్టుబడిగా మారుతాయి. ఈ రోజుల్లో ప్రతిది, మనని మన పని నుండి డిస్ట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి మనకి కావాల్సిన దానిని స్పష్టంగా పేపర్ పై వ్రాసుకోవాలి. ఉదాహరణకి మీరు శరీర భరువు తగ్గలనుకుంటే ఎంత భరువు తగ్గాలనుకుంటున్నారు, ఎప్పటి వరకు తగ్గాలనుకుంటున్నారు, ఎలాంటి చర్యలు వాటికోసం తీసుకుంటారు, ఇలాంటి విషయాలన్నీ స్పష్టంగా మనం వ్రాసుకొవలని సలహా ఇస్తాడు రచయిత. ఇలా స్పష్టంగా వుండటం వలన మన అంతచేతనా మనస్సు ఆ విషయాన్నీ అర్ధం చేసుకొని, దానికి సంబందించిన దారులు చూపెడుతుంది. ఇప్పుడు మన అంతచేతనా మనస్సుని వాడుకోవడానికి ఉపయోగపడే ఆ ఆరు విధానాలు ఏంటో చూద్దాము. ఫ్రండ్స్ ఈ ఆరు దశలు సాధన చేయడం ద్వార..ఎంతో మంది గొప్ప గొప్ప విజయాలు సాదించారు. మీరు కూడా ఈ ఆరు దశలను స్పష్టంగా ఇప్పుడు తెలుస్కోని, ఆచరణలో పెట్టడం ద్వార ఎన్నో గొప్ప విజయాలు సాదించవచ్చు.

మొదటిది........."మీకు ఎంత డబ్బు కావాలో ముందుగా మీ మనస్సులో నిర్ణయించుకోండి. నాకు చాలా డబ్బు కావాలి అనే మాటలో, ఆలోచనలో స్పష్టత ఉండదు. కాబట్టి మీ మనస్సు దానిని సరిగ్గా అర్ధం చేసుకోలేదు. ముందుగా స్పష్టంగా మీకు ఎంత డబ్బు కావాలో నిర్ణయించుకోండి. ఇలా స్పష్టంగా డబ్బులకు సంబందించిన ఒక నెంబర్ పెట్టుకోవడం వలన మీ మనస్సు దాని మీదే ఫోకస్ చెయ్యగలదు, అలాగే మీ మనస్సు అది సాదించటానికి దారులు వెతకగలదు. ఉదాహరణకు పది లక్షలు లేదా ఇరవయ్యి లక్షలు అని స్పష్టమైన నెంబర్ పెట్టుకోవాలి.

రెండవది.....మీరు కోరిన డబ్బు పొందటం కోసం..దానికి బదులుగా, మీరు ఏమి ఇవ్వడానికి సిద్దంగా వున్నారో ఖచ్చితంగా నిర్ణయించుకోండి. ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు అని గుర్తుకుపెట్టుకోవాలి. మీరు కోరుకున్న డబ్బుని పొందటానికి, మీ దగ్గర ఉన్నవాటిలో ఏది ఇతరులకు ఇస్తారో ఆలోచించండి, ఎలాంటి సేవలు అందించగలరో ఆలోచించండి, అది మీ వద్ద వున్న టైం అయి ఉండవచ్చు లేదా ఏదైనా టాలెంట్ అయిన లేదా మీరు బాగా చేయగలిగే ఎ పని అయిన కూడా అయివుండవచ్చు. అలాగే ఈ డబ్బు కోసం మీ సమయాన్ని, శక్తిని, మనషులను వేటిని ఉపయోగిస్తారో ఆలోచించండి.

మూడవది...మీరు కోరిన డబ్బుని, మీరు ఎ తేదిలోపు పొందలనుకుంటున్నారో వ్రాసుకోండి. ఎందుకంటే ఒక కలకి, ఒక లక్ష్యానికి వున్నా వ్యత్యాసం సమయ పరిమితి మాత్రమే. ఎప్పుడైతే మీ కలకి ఒక సమయ పరిమితి ఇస్తారో, ఆ కల మీ లక్ష్యంగా మారుతుంది. కాబట్టి మీరు కోరుకునే డబ్బు, మీకు ఎప్పటిలోగా కావాలో ఒక తేదిని నిర్ణయించుకోండి.

నాలుగవది...మీరు కోరిన డబ్బుని సాదించటానికి ఒక ప్లాన్ లేదా ప్రణాళిక వేసుకోండి. ఆ ప్రణాళికను ఎలా అమలు చేస్తారో స్పష్టంగా రాసుకోండి. ఆ మొత్తం ప్రణాళికలోని ముక్యమైన మైలురాళ్ళు గుర్తించండి. మీ ప్రణాలికను వెంబడే అమలు చెయ్యలేమేమో అనే అనుమానంతో వాయిదా వెయ్యకండి, ఎంత వీలైతే అంత పనిని ముందుగా మొదలు పెట్టండి. ఎక్కువగా ఆలోచించకుండా రోజు ఒక్కో అడుగు వేస్తూనేవుండండి.

ఐదవది......ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని దాని మీద పెద్ద అక్షరాలతో.... మీరు ఎంత డబ్బు పొందలానుకుంటున్నారు లేదా సంపాదించాలనుకుంటున్నారో స్పష్టంగా, వివరంగా రాయండి. అలాగే ఆ డబ్బు ఎ సమయం లోపల పొందాలనుకుంటున్నారో ఆ తేది వ్రాయండి. మీరు ఆ డబ్బు కోసం తిరిగి ఇవ్వాలను కుంటున్న సేవని, పనిని స్పష్టంగా వ్రాయండి. అలాగే మీరు అమలు చెయ్యాలనుకుంటున్న ప్రణాళికను వ్రాయండి. ఉదాహరణకి...మీరు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయితే ఇలా రాసుకోవచ్చు.... నేను పదిలక్షల రూపాయలను, ఇతరులకు కావాల్సిన ప్లాట్లు, ఇల్లులు అమ్మడం ద్వార 2020 మార్చ్ లోపు పొందుతున్నాను, ఈ డబ్బు కోసం రోజు నేను నలుగురుని కలిసి, వారికి నా సేవలు రోజుకు ఎనమిది గంటలు అందిస్తాను.

ఆరవది.... చివరిగా ప్రతిరోజు మీరు రాత్రి పడుకునే ముందు ఒకసారి మరియు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒకసారి, రోజు కి రెండుసార్లు, ప్రతిరోజూ గట్టిగా ఆ వ్రాసిన వ్యాక్యలను చదవండి. మీరు చదివేటప్పుడు, అందులోని విషయాన్నీ మీ మనస్సులో చూడండి, అనుభూతి చెందండి మరియు ఇప్పటికే ఆ డబ్బు మీ స్వాధీనంలో వున్నట్టు ఉహించండి.

ఇలా ఈ చిన్న పని రోజు చెయ్యడం వలన, మీ కృషి, అవకాశాలు పెరిగి మీరు కోరుకునే డబ్బుని, పెద్ద విజయాలని సంపాదించగలరు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories