Top
logo

మీ మనస్సుని ఇలా మచ్చిక చేసుకోండి

మీ మనస్సుని ఇలా మచ్చిక చేసుకోండి
Highlights

ఫెండ్స్ మనం ఈ రోజు చర్చించే అంశం... 'మీ మనస్సుని ఇలా మచ్చిక చేసుకోండి' ఒక దేవాలయ వద్ద దేవుడి ఉత్సవ...

ఫెండ్స్ మనం ఈ రోజు చర్చించే అంశం... "మీ మనస్సుని ఇలా మచ్చిక చేసుకోండి"

ఒక దేవాలయ వద్ద దేవుడి ఉత్సవ విగ్రహం యొక్క ఊరేగింపుల కోసం ఒక ఏనుగు వుంది, అది ప్రతి రోజు ఆ దేవాలయ వీదిలో ఉరేగింపుగా వెళుతూవుండేది... అయితే అది ఆ దారిలో వెళుతూ వెళుతూ...దాని యొక్క తొండంతో అక్కడ వున్న షాప్స్ లోని పూల దండలని, అరటి గెలలని, కొబ్బరి కాయలని, ఇంకా ఎన్నో వస్తువునలని తీస్తూ, పడేస్తూ అక్కడవారిని, వ్యాపారులను చాల ఇబ్బంది పెట్టేది. అక్కడి వారు, వ్యాపారాలు అది దేవుని ఏనుగు కాబట్టి దానిని ఏమనాలో తెలియక బాధపడేవారు. కానీ ఆ ఏనుగు గురించి, అందరు ఆ ఏనుగు తీసుకువెల్లె మావటి వాడిని ఎన్నో మాటలు అనేవారు. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఎంటా అని, ఆ మావటి వాడు బాగా అలోచించి ఒక పరిష్కరం కనిపెట్టాడు. అదేంటంటే...ఆ వీదిలోకి ఏనుగు రాగానే దాని తొండానికి తను తెచ్చిన "ఒక కట్టెను" ఇచ్చి పట్టుకోమని చెప్పేవాడు, ఎప్పుడైతే ఆ ఏనుగు తన తొండంతో ఆ కట్టెను పడిపోకుండా పట్టుకోవడం మొదలెట్టింది...అలా దాని ద్రుష్టి అంతా ఆ కట్టేని పట్టుకోవడం మీదే పెట్టడం వలన, ఆ వీధిలోని షాప్స్ లో ఎ వస్తువులు కూడా ముట్టడానికి దానికి వీలుకాలేదు. ఇలా మావటి వాడు చేసిన ఆ ఒక్క తెలివైన పని వలన షాప్ వారు అందరు ప్రశాంతంగా తమ పనులు చేసుకోసాగారు, మావాటి వాడికి కూడా మాటలు తప్పాయి. ఫ్రండ్స్! మన మనస్సు కూడా ఆ ఎనుగులాగానే చాల శక్తివంతమైనది, కానీ అది ఒక దగ్గర నిలకడగా వుండదు, ఆ ఏనుగుకు మావటి వాడు ఒక కర్రని ఇచ్చి బిజీ చేసినట్టే, మనం కూడా మన మనస్సును అనవసర విషయాలపై వెళ్ళకుండా, మన లక్ష్యం వైపు మాత్రమే పోయేవిధంగా శిక్షణ ఇవ్వగలిగితే ఎన్నో గొప్ప విజయాలు మనం సాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాము.

ఫ్రండ్స్ మనకు బయట జరిగే ఎన్నో విషయాల మీద, సంఘటనల మీద ఏలాంటి కంట్రోల్ ఉండదు, కాని కోరుకుంటే, సాధన చేస్తే మాత్రం...మన మనస్సు మీద మనకి పూర్తి కంట్రోల్ ఉంటుందని గ్రహించండి, ఇలా చెయ్యడం వలన మీరు మీ నిజమైన శక్తిని కూడా కనుగొంటారు. అసలు మన మనస్సు మీద, మనం ఎందుకు కంట్రోల్ తెచ్చుకోవాలి అని మీకు అనుమానం రావచ్చు. ఎందుకు మన మనస్సుకుని కంట్రోల్ చెయ్యాలి అంటే.." మన మనస్సు దాని కదే పని చేస్తే, స్వర్గాన్ని నరకంలా మార్చగలదు, నరకాన్ని స్వర్గంలా కూడా తయారు చేయవచ్చు అని జాన్ మిల్టన్ ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మనం కోరుకునే స్వర్గం లాంటి జీవితాన్ని మనం పొందాలి అంటే..మన మనస్సు, మన మాట వినాలి, దానికోసం ఒక ఐదు పద్దతులు మనకు ఉపయోగపడతాయి.

మొదటిది...మీ శ్వాసని గమనించండి.

మన మనస్సుకి మన శ్వాస కి చాల దగ్గరి సంబంధం వుంది, మీరు ఒత్తిడి లో వున్నప్పుడు కొన్ని దీర్గ శ్వాసలు తీసుకుంటే మీ బ్రెయిన్ కొంత రిలాక్స్ అయి, ప్రశాంతతని ఫీల్ అవుతారు, అలాగే మీ ఆలోచనలు కూడా ఒక పద్దతిలో రావటం మొదలు పెడతాయి. కాబట్టి మీ మనస్సు పై కంట్రోల్ కోసం మొదటి మెట్టు దీర్గ శ్వాసలు. ఆ తర్వాత...

రెండవది... ప్రతిరోజు పదినిమిషాల సమయం మీ ఆలోచననలని గమనించండి.

ఒక దగ్గర కూర్చున్న తర్వాత దీర్గ శ్వాస తీసుకున్న తర్వాత మీ ఆలోచనలు పరిశీలించండి, ఎందుకంటే ఒత్తిడికి వ్యతిరేకంగా మన వద్ద ఉన్న గొప్ప ఆయుధం, ఒక ఆలోచనను వదిలి మరో ఆలోచనను ఎంచుకోవడానికి వున్నా సామర్ధ్యం, కాబట్టి ఆ సామర్ద్యం వాడుకోవాలి అంటే వచ్చిన ఆలోచన ఏంటో తెలియాలి. అలాగే మీ ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి ఎప్పుడైనా పదాలుగా మారవచ్చు కాబట్టి. ఆ తర్వాత

మూడవది... మీ లక్ష్యానికి సంబందించిన విషయాలు ఆలోచించండి: మనకు ఆలోచనలు వస్తూనే వుంటాయి, వాటిలో ఎన్ని మన లక్ష్యానికి సంబంధించినవి అని తెలుసుకోవటం, వాటిని మీకు కావలసినట్టు మలచుకోవటం అవసరం, ఎందుకంటే మన మనస్సు మన శరీరంలోని కండరం లాంటిదే, దానికి ఎంత ఎక్కువ వ్యాయామం ఇస్తే అంత వృద్ది చెంది శక్తివంతమవుతుంది. కాబట్టి మీ లక్ష్యానికి సంబందించిన ఆలోచనలతో మీ మనస్సు నింపండి.

నాలుగవది.. మంచి ఫలితాలను ఉహించండి:

మీ మనస్సు లో మీ లక్ష్యాన్ని సాదించినట్టు ఉహించండి, ఎప్పుడైతే ఎక్కువగా మీ మంచి ఫలితాలను ఉహించడం మొదలేడుతారో, మీ మనస్సు మీ కంట్రోల్ వచ్చినట్టే, ఎందుకంటే ఆ ఉహకి సంబందించిన ఆలోచనలు ఇక వరదలా వస్తాయి కాబట్టి. మంచి ఫలితాలనే ఎందుకు ఉహించాలి అంటే మంచి అయిన, చెడు అయిన మన మనస్సు తో పోలిన వాటిని ఆకర్షించే అద్బుత శక్తి మన మనస్సుకు వుంది కాబట్టి. ఇక చివరగా...

ఐదవది... వారానికి ఒక రోజు మౌన వ్రతం పాటించండి:

మన ఆలోచనలు సరైన విధంగా మలచడానికి, మన మనస్సుని కంట్రోల్ లో పెట్టడానికి ఉపయోగపడేది, మన ఆలోచనలను పరిశీలించటానికి అద్బుతంగా సహాయపడేది...ఈ మౌన వ్రతం. వారంలో మీకు వీలైన ఒక్క రోజు మౌనవ్రతం పాటించండి, అలా ఏడూ వారలు సాదన చేసిన తర్వాత ఫలితాలు చూడండి. చివరిగా మనం అర్ధంగా చేసుకోవాల్సింది...ఈ ప్రపంచంలో ఎన్నో విషయలు మన కంట్రోల్ లో ఉండవు, ఒక్క మన ఆలోచనలు తప్ప, ఒక్క ఆలోచనలను మన కంట్రోల్ లో వుంచుకుంటే, దాదాపు ఎన్నో విషయాలను కంట్రోల్ లో వుంచుకున్నట్టే. ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలు మీరు ఆచరణలో పెట్టడం ద్వార గొప్ప జీవితాన్ని మీరు ఆనందించగలరు, ఎందుకంటే 'మీరు మీ మనస్సు మార్చుకోగలిగితే, మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. సో అల్ ది బెస్ట్.

Next Story