కోపం ఒక శాపమా! కథ.

కోపం ఒక శాపమా!  కథ.
x
Highlights

కోపం యొక్క రూపం సమసిపోయిన ...అది చేసిన పాపం మాత్రం ఎప్పటికి నిలిచివుంటుంది. శ్రీ.కో. ఫ్రెండ్స్...కొద్దిమంది ...ప్రతీ చిన్నదానికి కోపానికి...

కోపం యొక్క రూపం సమసిపోయిన ...అది చేసిన పాపం మాత్రం ఎప్పటికి నిలిచివుంటుంది. శ్రీ.కో.

ఫ్రెండ్స్...కొద్దిమంది ...ప్రతీ చిన్నదానికి కోపానికి వస్తుంటారు, ఆవేశపడుతుంటారు..

అలా కోపంతో వారు చేసిన పనులకి, వారే తరువాత అపరాద భావంతో క్రుంగిపోతారు.

అలా ఇబ్బంది పడకుండా ఉండటానికి ఏదైనా దారి వుందా...అని ఆలోచిస్తే...

నేను ఈ మద్య విన్న ఒక కథ గుర్తుకి వస్తుంది........ఆ కథలో...

ఒక అబ్బాయికి ప్రతి చిన్న విషయానికి బాగా కోపం వస్తువుంటుంది... ఆ సమస్యని ఎలా తగ్గించుకోవాలి అని ఆ అబ్బాయి ఒక రోజు తన తండ్రిని అడగగా...

అతని తండ్రి...అతనికి మొలలతో వున్నా ఒక బ్యాగ్ మరియు సుత్తి ఇచ్చి చెప్పాడు.

"నీకు కోపం వచ్చిన ప్రతిసారీ నీ బెడ్ రూమ్ లోని చెక్క బోర్డుకు ఒక మొల కొట్టమని చెప్పాడు'

తండ్రి చెప్పిన ప్రకారమే...ఆ అబ్బాయి.... తొలి రోజు "పంతొమ్మిది మొలలను" తన బెడ్ రూమ్ లోని చెక్క బోర్డు కు కొట్టాడు.... రెండవ రోజు పదకొండు... అలా రోజువారీగా, నెమ్మదిగా... నెమ్మదిగా మొలల సంఖ్య తగ్గిపోయాయి..

ఒక సమయంలో ....ఆ మొలలు కొడుతూ..కొడుతూ...మొలకోట్టటం కన్నా కోపం తగ్గిచుకోవడమే సులువు అనుకున్నాడు ఆ అబ్బాయి.

ఒక రోజు మొత్తంలో ..ఒక్క సారి..మాత్రమే... కోపం రావటం వల్ల ఒక్కటే మొల కొట్టాల్సిన అవసరం వచ్చింది.

చివరికి ఆ అబ్బాయి కోరుకున్న రోజు రానే వచ్చ్చింది...

ఆ రోజు... ఆ అబ్బాయికి కోపము అసలు రోజు మొత్తంలో రాలేదు.... అతను దాని గురించి తన తండ్రికి చాల సంతోషంగా చెప్పాడు.

అప్పుడు ఆ తండ్రి... ఒక సలహా ఇచ్చాడు, ఇప్పటి నుండి కోపం రాని ప్రతి రోజు..

"ఒక కొట్టిన మొలని ఆ తన బెడ్ రూమ్ లోని చెక్క బోర్డు నుండి తీసివేయవచ్చని"

అప్పటి నిండి రోజు నిగ్రహాముతో వుండటం వల్ల ప్రతి రోజు ఒక మొల తీసేస్తూ వచ్చాడు, కొద్ది రోజుల్లోనే అన్ని మొలలు అయిపోయాయని...ఆ విషయం, తన తండ్రితో ఆ అబ్బాయి సంతోషంగా చెప్పాడు.

అప్పడు తండ్రి "చాల సంతోషం"...అంటూ...తన కుమారుని చేతి పట్టుకొని ఆ చెక్క బోర్డు వద్దకు వచ్చాడు. ఆ బోర్డు చూసి తండ్రి.....తన కొడుకుతో.. నీకు కోపం తగ్గినందుకు సంతోషమే...కాని ఆ చెక్క బోర్డు ని చూసావా...అని అడిగాడు.

ఆ చూసాను...ఒక్క మొల కూడా లేదు...అని ఆగిపోయి...ఆ మొలలు చేసిన రంద్రాలు చూస్తూ...అయ్యో.....అనుకోని ఆలోచనలో పడ్డాడు.

అప్పుడు తండ్రి అన్నాడు... ఇక ఆ చెక్క బోర్డు ఎప్పటికి పాత బోర్డులా కాదు, ఎందుకంటే ఆ మొల చెక్క బోర్డు లోపలికి వెళ్లి రంధ్రం చేసింది కదా...అలాగే కొన్ని సార్లు, మనం కోపంలో అన్నమాటలకి, చేసినపనులకి మనలో మార్పు వచ్చిన అది చేసిన గాయం మాత్రం అలాగే ఉండిపోతుంది అని.

కాబట్టి ....తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షా .... అనే విషయం మరచిపోకూడదు ఫ్రెండ్స్.

Show Full Article
Print Article
Next Story
More Stories