కేంద్రానికీ మాకూ మధ్య విభేదాలేమీ లేవు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

కేంద్రానికీ మాకూ మధ్య విభేదాలేమీ లేవు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
x
Highlights

ఢిల్లీ లో పెరిగిపోతున్న నేరాలను అదుపులో ఉంచాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్...

ఢిల్లీ లో పెరిగిపోతున్న నేరాలను అదుపులో ఉంచాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. అందరూ అనుకుంటున్నట్టు కేండ్రానైకి, తమకూ ఎటువంటి మనస్పర్థలూ లేవని అయన చెప్పారు. ఇరువైపులా విమర్శలు చేసుకోవడం మానుకోవాల్సి ఉందన్నారు. ఆదివారం దేశరాజధానిలోని ఒక నివాససముదాయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వం ప్రజల భద్రతే ధ్యేయంగా అన్నిచోట్ల సీసీ కెమెరాల ఏర్పాటునకు సిద్ధమయ్యిందన్నారు. దేశరాజధానిలో పెరుగుతున్న నేరాల సంఖ్య, ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై పెరిగిపోతున్న నేరాలను అదుపులో పెట్టేందుకు తమ శాయశక్తుల ప్రయత్నిస్తామన్నారు. అయితే దిల్లీ పోలీసు వ్యవస్థ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుందని, కేంద్రం తమకు సహకరిస్తే వీటిని నియంత్రించగలమన్నారు. కేంద్రానికి తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు. మొత్తం 3 లక్షల కెమెరాల ఏర్పాటుకు ఉపక్రమించామన్నారు. ఈ సీసీ కెమెరాల వల్లే ఆరేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడిన ప్రబుద్ధుడిని పట్టుకోగలిగామన్నారు. అయితే వీటి ఏర్పాటుకు ఆలస్యం అవుతుందన్నారు. దీనికి దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్ అనీల్‌ బైజల్‌తో ఉన్న విభేదాలే కారణమన్నారు. వచ్చే డిసెంబరు నాటికి ఈ సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తిచేయాలని కేజ్రీవాల్‌ సంకల్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories