హెల్మెట్ లేదు.. నంబర్ ప్లేట్ లేదు..బీజేపీ నేత హల్ చల్

హెల్మెట్ లేదు.. నంబర్ ప్లేట్ లేదు..బీజేపీ నేత హల్ చల్
x
Highlights

ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్ పోలీసులు కంగుతిన్నారు. ఎందుకనుకుంటున్నారా.. ఎందుకంటే బండి నడిపే వ్యక్తికి హెల్మెంట్ లేకుండా ఏం చక్క చక్కర్లు కొడుతున్నాడు...

ఉత్తరప్రదేశ్‌లో మొరాదాబాద్ పోలీసులు కంగుతిన్నారు. ఎందుకనుకుంటున్నారా.. ఎందుకంటే బండి నడిపే వ్యక్తికి హెల్మెంట్ లేకుండా ఏం చక్క చక్కర్లు కొడుతున్నాడు ఆ బీజేపీ నేత. అయితే బండికి నంబర్ ప్లేటు కూడా లేదు.. అసలు నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట మాత్రం బీజేపీ జెండా రంగులు, బీజేపీ అని పూసేశాడు. అదేంటి అని ఆ వ్యక్తిని ప్రశ్నించాగా.. హే పార్టీ, మా రాష్ట్రం, మా దేశం అంటూ నానా హంగామా చేశాడు. అయితే ఆ వ్యక్తి చెప్పిన మాటలకు పోలీసులు ఉరుకుంటారా మరి.. మీ పార్టీ అధికారంలో ఉందని నీకే అంత ఉంటే.. మరి మేము ఆన్ డ్యూటిలో ఉన్న పోలీసులం మాకేంత ఉండాలి అంటూ ఆ బీజేపీ నేతకు వెంటనే ఛలాన్లు వేశారు.. అయితే దానికి ఆయన అసలు నేను ఏ ఛలాన్లు కట్టను.. అంటే కట్టను అని మొండికేశాడు.. హ హ అదీ చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. అతడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories