ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటనకు ఫుల్ స్టాప్.

ఉద్ధవ్ థాకరే
x
ఉద్ధవ్ థాకరే
Highlights

రామ మందిరం, బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన...

రామ మందిరం, బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇటీవల సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించిన విషయం అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం మూడు నెలల్లో 'అయోధ్య ట్రస్ట్'ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24న అయోధ్య రామమందిర నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళతానని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ప్రకటనను విడుదల చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఈ పర్యాటన రద్దుచేసుకున్నారని వారు తెలిపారు.

ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని, వారికి రక్షణ కల్పించలేమని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా స్ఫష్టం చేసిందని వారు తెలిపారు. ఈ ఒక్క విషయమే కాకుండా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో పార్టీ శ్రేణులు బిజీగా ఉన్నాయని మరో వైపు తెలుపుతున్నారు. ఏదైతేనేం మొత్తానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అయోధ్య పర్యటన మాత్రం రద్దయింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories